ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్​నే అంటారా? - వైఎస్ జగన్​పై షర్మిల ప్రశ్నల వర్షం - Sharmila Counter to YS Jagan - SHARMILA COUNTER TO YS JAGAN

YS Sharmila Counter to YS Jagan Mohan Reddy: దిల్లీలో తాను చేసిన ధర్నాకు కాంగ్రెస్‌ ఎందుకు రాలేదో చెప్పాలన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు, ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు సమాధానం ఇచ్చారు. మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలో చెప్పాలంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు. జగన్‌ నిరసనలతో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉందని స్పష్టం చేశారు.

YS Sharmila Counter to YS Jagan Mohan Reddy
YS Sharmila Counter to YS Jagan Mohan Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 12:25 PM IST

YS Sharmila Counter to YS Jagan Mohan Reddy: దిల్లీలో ధర్నా నిర్వహించడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్​కు ప్రతిస్పందిస్తూ ట్వీట్ చేశారు. జగన్‌ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని షర్మిలారెడ్డి నిలదీశారు.

పార్టీ ఉనికి కోసం దిల్లీలో కపట నాటకం ఆడినందుకా, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా అని ప్రశ్నించారు. ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్​కు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత కోసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారన్నారు.

వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారని మండిపడ్డారు. మణిపుర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే, జగన్ సంఘీభావం ఎందుకు తెలియచెయ్యలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ నిరసనలో స్వలాభం తప్ప నిజం లేదని, రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని అన్నారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారని షర్మిలా రెడ్డి విమర్శించారు.

ఏది విత్తుతారో అదే కోస్తారు- బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు ధర్నా చేయలేదు?: షర్మిలా - sharmila fire on jagan

తల్లికి వందనంపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్​సీపీ నేతలకు కోపం ఎందుకు?: షర్మిల

ABOUT THE AUTHOR

...view details