YS Sharmila Comments on Jagan: కంటికి కనిపించని పొత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రైస్తవులపై దాడి ఘటనపై కూడా వైఎస్సార్సీపీ స్పందించలేదని, ఆదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను జగన్ దోచిపెట్టారని విమర్శించారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారని అన్నారు.
మోదీ వారసుడిగానే జగన్ ఉన్నారని, వైఎస్సార్ వారసుడిగా కాదని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింటే ఐదేళ్లుగా బీజేపీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జగన్ అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్న కేంద్రంలోని పెద్దలు, చర్యలు తీసుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డారా అన్నారు. కేంద్రంలోని కాగ్, ఈడీ సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్తపుత్రుడు కాబట్టే చర్యలు తీసుకోవడానికి ఐదేళ్లుగా వెనుకంజ వేశారని ఆరోపించారు.
'నవ సందేహాల'కు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ - Sharmila Letter To CM Jagan
తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని అన్నారు. సీబీఐ విచారణ కావాలని అధికారంలో లేనప్పుడు అడిగారని, అధికారంలోకి రాగానే వద్దన్నారని దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. తన భర్త చీకట్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని కలిశారనే అవినాష్ రెడ్డి ఆరోపణలను షర్మిల ఖండించారు. అవినాష్ రెడ్డి చేసినట్లుగా మధ్య రాత్రి గొడ్డలి రాజకీయాలు చేసే అలవాటు తమకు లేదన్నారు.
మోదీ వారసుడిగానే జగన్ ఉన్నారు - వైఎస్సార్ వారసుడిగా కాదు: షర్మిల (Etv Bharat) తన భర్త బీజేపీ నేతను కలవలేదని, కలవరు అని, వారి వద్ద రుజువులు కూడా లేవని షర్మిల స్పష్టం చేశారు. తనకు వెయ్యికోట్ల రూపాయలు పనులు ఇవ్వలేదనే కారణంతో విమర్శలు చేస్తున్నట్లు తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి ఆరోపణలను సైతం షర్మిల ఖండించారు. జగన్ వేసే బిస్కట్లకు అమ్ముడుపోయి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్డీఏ కూటమికి ఉత్తరాదిలో నూకలు చెల్లిపోయాయనే కారణంతో, ఇపుడు దక్షిణాదిపై బీజేపీ నేతలు దృష్టి సారించి జగన్పై ఆరోపణలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేని ఆయన ప్రశ్నించారు.
అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా?- జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం : షర్మిల - YS Sharmila vs CM Jagan