Youth Losing Their Lives in the Craze of Reels:రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతున్న వారు కొందరైతే మరికొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి అనుకుని కనీస జాగ్రత్తలు పాటించకుండా రీల్స్ చేస్తున్నారు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటున్నారు. అంతకుమించి అందరిలోవారు స్పెషల్‌గా కనిపించొచ్చు. ఇలా కారణాలతో అనేకమైనా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు, రీల్స్ మోజులో పడి కొందరు నేరాలకు తెరలెపుతుంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు
- ఇద్దరు యువకులు రీల్స్‌కు బానిసలుగా మారి ద్విచక్రవాహన దొంగలుగా మారారు. వారిని అదుపులోకి పోలీసులు విచారించగా 'ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేందుకు ఖరీదైన బైక్‌లు కావాలని అందుకే దొంగతనం చేశామని' చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
- ఇటీవల తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్లు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేశారు. బైకు అదుపుతప్పి కిందపడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
- రీల్స్ మోజులో పడి తనను, కుమార్తెను పట్టించుకోవడంలేదని చివరికి వంట కూడా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో రెండేళ్ల చిన్నారి అనాథగా మారి ప్రభుత్వం సంరక్షణ గృహంలో ఆశ్రయం పొందుతోంది.
సోషల్ మీడియాపై పిచ్చి పీక్స్ - రీల్స్ మోజులో యువతరం ప్రాణాలు బలి - instagram reels deaths
వ్యసనంగా మారుతున్న సోషల్ మీడియా:మద్యం గ్యాంబ్లింగ్‌కు బానిసగా మారినవారు ఎలా దాన్ని వదులుకోలేకపోతారో, సామాజిక మాధ్యమాలకు వ్యసనంగా మారిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో అందరిలో స్పెషల్ గుర్తింపు ఉండాలనే భావన ఎంతకైనా దారితీస్తుందని పేర్కొన్నారు. పోస్టు చేసిన వీడియోలకు, ఫొటోలకు లైకులు రాకపోతే ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. బైక్‌పై స్టంట్లు వేయడం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్నట్లు వీడియోలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం, అవసరం లేకున్నా అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం ఇవన్నీ ఇలాంటి కోవకే చెందినవంటున్నారు నిపుణులు.