Young Man Died of Heart Attack in Wedding Ceremony :ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack)తో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. అప్పటివరకూ ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉన్నవారు సైతం హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత నుంచి వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కర్నూలు జిల్లాలో తన స్నేహితుడి వివాహానికి వచ్చి గుండెపోటుతో స్టేజీపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాల్లోకి
బహుమతి అందజేస్తుండగా గుండెపోటు :కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని పెనుమాడలో వివాహ వేడుకల్లో వంశీ కుమార్ అనే పాతికేళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. గోనెగండ్ల మండలంలోని బి.అగ్రహారానికి చెందిన వంశీ కుమార్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. స్నేహితుడి వివాహానికి తోటి మిత్రులతో హాజరయ్యాడు. వివాహ వేదికపై నూతన వధూవరులకు మిత్రులు బహుమతి అందజేశారు. ఉత్సాహంగా నూతన దంపతులు ఆ బహుమతి కవర్ ఓపెన్ చేస్తుండగా వేదికపై ఉన్న వంశీ కుమార్ గుండెపోటుతో కిందపడబోయాడు. ఇది గమనించి స్నేహితులు వెంటనే పట్టుకున్నారు. కానీ ఆలోపే వంశీకుమార్ మృతి చెందాడు. వివాహానికి హాజరైన మిత్రుడు చనిపోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
వివాహ వేడుకలో విషాదం - గుండెపోటుతో యువకుడి మృతి (ETV Bharat) అమ్మ వచ్చిందని ఆనందంలో పరుగెత్తిన చిన్నారి, అంతలోనే?
గుండెపోటు లక్షణాలు :ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని వైద్యులు అంటున్నారు. అప్పటివరకు బాగానే ఉన్న వారు, ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. బీకేఎస్ శాస్త్రి తెలిపారు. గుండెపోటును ముందుగానే గుర్తించలేకపోవడంతోనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఛాతీలో ఎడమ వైపు నొప్పి వస్తుంది. ఏదో బరువు మోస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయాసం, చెమటలు పడతాయి.
కొంత మందికి అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా హార్ట్ ఎటాక్ రావొచ్చు. ఇటీవల ఓ 55 ఏళ్ల వయసు గల వ్యక్తి గడ్డి కోస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడు. అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా, ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు రావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వెంటనే అన్నీ పరీక్షలు చేసి ఫలితాలకు అనుగుణంగా చికిత్స చేస్తారు. అవసరమైతే యాంజియోగ్రామ్ చికిత్స అందిస్తారు. అసలు 30 ఏళ్ల వయసులో ఇలా గుండెనొప్పి బారినపడతారా? గుండె సంబంధిత సమస్యలకు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి? వంటి ప్రశ్నలకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. బీకేఎస్ శాస్త్రి ఏమంటున్నారో ఇక్కడ క్లిక్ చేసి వీడియోలోచూడండి.
గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి - అంతకు ముందు ఏం జరిగిందంటే!