ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో దారుణం - తీసుకున్న రూ. 13 వేలు తిరిగి ఇవ్వలేదని యువకుడిని హతమార్చిన ఫ్రెండ్స్​ - ​young person murder in hyderabad - ​YOUNG PERSON MURDER IN HYDERABAD

A young Man Killed Not Repaying Debt : నేటి కాలంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. తాజాగా తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ యువకుడిని మిత్రులే దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

young_man_murder
young_man_murder (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 12:43 PM IST

Young Man Murder in Hyderabad :ఇటీవల కాలంలో డబ్బు కోసం ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు. మానవతా విలువలు మరిచిపోయి, అయిన వారు అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా ఓ యువకుడు స్నేహితుల వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని వారు అతణ్ని అడిగారు. అందుకు అతడు నిరాకరించడంతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Young Person Brutally Killed in Hussaini Alam : డబ్బు విషయమై తలెత్తిన వివాదం యువకుడి హత్యకు దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హతమార్చిన ఘటన పాతబస్తీ హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సురేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్​ ముర్గిచౌక్‌ ప్రాంతంలో నివసించే మహ్మద్‌ మసూద్‌(28) చార్మినార్‌ ప్రాంతంలో చలువ కళ్లద్దాలు విక్రయించి జీవనం సాగిస్తున్నాడు.

మృతుడు మహ్మద్​ మసూద్​ (ETV Bharat)

బాపట్ల యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా కత్తులతో దాడి - Young Man Murder

సమీపంలోని ఖిల్వత్‌ గ్రౌండ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ షాహెద్‌ సైతం చలువ కళ్లద్దాలు విక్రయిస్తుంటాడు. చికెన్‌ సెంటర్‌లో పనిచేసే ఖిల్వత్‌కు చెందిన అలీ మిర్జా, సయ్యద్‌ షాహెద్‌లతో మసూద్‌కు పరిచయం ఉంది. కొద్దికాలం క్రితం అలీ మిర్జా నుంచి మసూద్‌ రూ.8,000 అప్పు తీసుకున్నాడు. రూ.5,000 సయ్యద్‌ షాహెద్‌ నుంచి చేబదులు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమని ఇద్దరు కొన్ని రోజులుగా అడుగుతున్నా, మహ్మద్‌ మసూద్‌ పట్టించుకోవడం లేదు.

పలుమార్లు ఒత్తిడి చేయడంతో తాను ఇవ్వలేనని, ఎక్కువ చేస్తే మీ ఇద్దరినీ చంపేస్తానని మసూద్‌ వారిని బెదిరించాడు. దీంతో ఇరువరూ మసూద్‌ను చంపాలనుకున్నారు. మాట్లాడుకుందామని అతడిని మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో న్యూముర్గి చౌక్‌కు రమ్మన్నారు. అక్కడికి రాగానే ఇద్దరూ మసూద్‌పై ఒక్కసారిగా దాడిచేశారు. కత్తితో పొడిచారు. కిందపడిపోయిన అతనిని బండరాయితో మోది హతమార్చి పరారయ్యారని ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సురేందర్‌ పేర్కొన్నారు.

తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా, అదనపు డీసీపీ షేక్‌ జహంగీర్‌, ఇన్‌స్పెక్టర్‌ పరిశీలించారు. చార్మినార్‌ ఎమ్మెల్యే మీర్‌ జుల్ఫికర్‌అలీ కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులిద్దరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

కోనసీమలో దారుణం - అనుమానంతో కుమార్తెను కడతేర్చిన తండ్రి - Father Killed His Daughter

మైనర్​ తల నరికి తీసుకెళ్లిపోయిన వరుడు- మ్యారేజ్ లేట్ అవుతుందనే కోపంతో! - Young Man Murdered Girl

ABOUT THE AUTHOR

...view details