Yearly Once Open Temple in Nalgonda District Of Telangana : సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. కొన్ని ఆలయాలను మాత్రం కొన్ని నెలలపాటు తెరిచి మళ్లీ మూసేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామంలో ఉన్న స్వయంభూ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుడి ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజే వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఈ ఆలయ తలుపులు తెరుచుకోవడం ఈ ఆలయ విశేషం.
900 ఏళ్ల నాటి దేవాలయం ఇది :చిల్లాపురం గ్రామంలోని ఓ ఎత్తైన గుట్టపైన 900 ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వరస్వామి వెలిసినట్లు చరిత్ర చెబుతుంది. ఆ గుట్టను రామస్వామి గుట్టగా పిలుస్తారు. ప్రతి కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయమిది. నేడు (15 వ తేదీన) కార్తిక పౌర్ణమి నాడు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ జాతరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు ఉండవు. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలొచ్చి దర్శించుకుంటున్నారు.
పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధం- జాతర విశిష్టతతోపాటు షెడ్యూల్ మీకోసం!