ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు - Land grabs in AP

YCP Leaders Land Grabs With Fake Documents: మన వద్ద అన్ని పత్రాలు ఉన్నా ఆస్తుల క్రయవిక్రయాలకు ఎన్నో నిబంధనలు అడ్డొస్తుంటాయి. అదే వైసీపీ నేతలకైతే చిటికెలో పనైపోతుంది. అడిగిన ప్రతి పత్రం అచ్చవుతుంది. కోరిన సర్టిఫికెట్‌ చేతికి అందుతుంది. గ్రామాల్లో ఉండే వీఆర్వో అయినా జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్‌దైనా క్షణాల్లో సంతకాలు అయిపోతాయ్.

ycp_leaders_land_grabs
ycp_leaders_land_grabs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 8:32 AM IST

సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు

YCP Leaders Land Grabs With Fake Documents:రాష్ట్రంలో ఖాళీ భూములపై కన్నేసి పాగా వేస్తున్న వైసీపీ నేతలు ఈ దందాలో నయా ట్రెండ్ సెట్ చేశారు. ఏ భూమైనా సరే వారికి నచ్చిందంటే అది హాంఫట్. కింద స్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు వారే వేలిముద్రలు వేసేస్తున్నారు. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో దర్జాగా ఆక్రమించేస్తూ ఇతరులకు విక్రయించేస్తున్నారు. కొన్నిచోట్ల వైసీపీ నేతల భాగస్వామ్యంతోనే ఈ దందా కొనసాగుతోంది.

అధికార పార్టీ అక్రమాలతో భూములకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆస్తులు కలిగి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్నవారికి కంటిమీద కునుకు ఉండడం లేదు. స్థలాలు కొనుగోలు చేసి, విదేశాల్లో స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో అక్రమార్కులు గాలిస్తూ వాటిని కైవసం చేసుకుంటున్నారు. ఫోర్జరీ సంతకాల ఆధారంగా విక్రయ దస్త్రాలు సిద్ధం చేసి ప్రైవేట్‌ ఆస్తులను కాజేస్తున్నారు.

రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

సీఎం జగన్‌ ఇలాఖాలో నకిలీ సంతకాల బాగోతం:

  • నకిలీ సంతకాల బాగోతం సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ వెలుగు చూసింది. 35 ఎకరాల చుక్కల భూములపై కలెక్టర్‌ పేరిట నకిలీ ఎన్వోసీలు సృష్టించి కిందటేడాది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
  • ప్రొద్దుటూరు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అయితే స్థానిక ప్రజాప్రతినిధి చెబితేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రచారం.
  • రాయచోటిలో కలెక్టరేట్‌ నిర్మాణానికి కేటాయించిన 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో నుంచి 4.50 ఎకరాలను ఎమ్మెల్యే అనుచరులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఇదే ప్రాంతంలోని 13వ వార్డు కౌన్సిలర్‌ తన భార్య, బంధువుల పేర్లతో ఆరెకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పావులు కదిపారు.
  • రాజంపేట, బద్వేలులోనూ నకిలీ సర్టిఫికేట్లతో భూములు కొట్టేశారు. రాజంపేట మండలం తాళ్లపాకలో ప్రభుత్వ భూమికి నకిలీ ఎంజాయ్‌మెంట్ సృష్టించి రేణిగుంటలో రిజిస్ట్రేషన్ చేయించారు. రూ.7 కోట్ల విలువైన ఇదే భూమిని వేరొకరికి విక్రయిస్తూ రాజంపేటలో దస్తావేజు సిద్ధం చేశారు. విషయం బయటకు పొక్కడంతో వీఆర్వోను సస్పెండ్ చేశారు.

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా - వివాదాలుంటే సెటిల్మెంట్ ! మాట వినికపోతే బదిలీలు, కేసులు - తండ్రి అడుగు జాడల్లో కుమారుడి అక్రమాలు!

District Wise Land Grabs of YCP Leaders:

Kurnool:కర్నూలుకు చెందిన ఒకరు అయిదున్నర సెంట్ల స్థలాన్ని ఇరవై ఏళ్ల కిందట కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్పట్లో ఫొటో విధానం అమలులో లేనందున పేరు, చిరునామా ఆధారంగా రిజిస్ట్రేషన్‌ జరిగింది. దీనిపై కన్నేసిన మాజీ కార్పొరేటర్‌ కుమారుడు ఓ మహిళను తీసుకెళ్లి స్థల యజమాని పేరు, చిరునామాతో ఆధార్‌కార్డు తయారు చేయించి, నకిలీ దస్తావేజును సృష్టించి మరొకరికి విక్రయించేశారు.

Visakhapatnam:విశాఖతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ ప్రైవేట్‌ భూములకు రక్షణ కరవైంది. ఆనందపురం మండలం గొట్టిపల్లిలోని 4.68 ఎకరాల భూమికి తప్పుడు పత్రాలతో దస్తావేజులు సృష్టించారు. బయోమెట్రిక్‌ ముద్రలు, అధికారుల సంతకాలు, డిజిటల్‌ సమయాలను సైతం కచ్చితంగా ముద్రించి కొనుగోలుదారులను మోసం చేశారు.

Srikakulam District:శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎస్సీలకు పంపిణీ చేసిన భూములకు భారీగా విలువ పెరగడంతో వారి నుంచి ఆ భూమిని హస్తగతం చేసుకుని సర్వే నెంబర్ల మార్చి పురపాలక సంఘం నుంచి అనుమతి పొంది భారీ భవనాలు నిర్మిస్తున్నారు.

Kadapa District:కడప జిల్లా బద్వేలు మండలం గుంతపల్లి మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో గతంలో పనిచేసిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి గ్రామకంఠం భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Nandyala:నంద్యాలలో 50 సెంట్ల భూమికి సంబంధించిన యజమానులు మరణించగా వారికి వారసులు ఎవరూ లేరు. రంగంలోకి దిగిన రౌడీషీటర్, మరికొందరు కలిసి ఓ మహిళపై నకిలీ కుటుంబ వారసత్వ పట్టా పొందారు. ఆస్తిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరొకరికి విక్రయించారు.

Prakasam District:ప్రకాశం జిల్లాలో నకిలీ పత్రాలు, స్టాంపులతో ఒంగోలు కేంద్రంగా గతేడాది సాగిన వందల ఎకరాల భూకబ్జాల బాగోతం సంచలనం సృష్టించింది. నకిలీ సర్టిఫికెట్లతో గత రెండేళ్లలో ఒంగోలు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం కేంద్రంగా మరో అక్రమార్కుల ముఠా విజృంభించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ నకిలీ పత్రాల కుంభకోణంలో నిందితుల్లో కొందరు వైసీపీ వాళ్లే ఉన్నారు.

వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!

NTR District:ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనూ పెద్దఎత్తున దొంగపత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. గాంధీనగర్‌లో 1.2 ఎకరాల భూమికి సంబంధించి 1982లో జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను సేకరించి తండ్రీకొడుకులు అక్రమాలకు పాల్పడ్డారు. సింగ్ నగర్ జేఎన్​ఎన్​యూఆర్​ఎం(JNNURM) ఇళ్లలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. 16 ప్లాట్లను పూర్తిగా ఒకే కుటుంబానికి దొంగపత్రాలతో అప్పగించారు. వీరంతా జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిగా చూపించారు.

మొద్దునిద్రలో రిజిస్ట్రేషన్‌ శాఖలు:ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ గ్యాంగులు ఊరూరా విజృంభిస్తుంచాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున అధికార పార్టీ నేతల వత్తాసుతో కొందరు ప్రభుత్వ భూములను కాజేస్తూ వాటికి రిజిస్ట్రేషన్‌ల రూపంలో అధికారిక ముద్ర వేయించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు మొద్దు నిద్రపోతున్నాయి. రిజిస్ట్రేషన్‌ల కోసం ఎవరైనా కార్యాలయానికి వచ్చినప్పుడు సబ్‌-రిజిస్ట్రార్లు తప్పనిసరిగా లింకు దస్తావేజులు పరిశీలించాలి. అసలు యజమాని వచ్చినట్లు నిర్థారించుకున్న అనంతరమే రిజిస్ట్రేషన్‌ చేయాలి. కానీ మామూళ్ల మత్తులో ఈ ప్రక్రియ కొన్నిచోట్ల జరగడం లేదు. రిజిస్ట్రేషన్‌ ఫీజులు భారీగా పెంచుతూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖ అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయకుండా చోద్యం చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details