తెలంగాణ

telangana

ETV Bharat / state

వరల్డ్ ఫొటో గ్రఫీ డే స్పెషల్ - స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శన - World Photography Day Exhibition - WORLD PHOTOGRAPHY DAY EXHIBITION

World Photography Day 2024 : వరల్డ్​ ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్​లో ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు. భిన్నమైన భావాలను తనలో బంధిస్తూ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేసే గొప్ప శక్తి చిత్రాలకుందని నిర్వాహకులు అన్నారు.

World Photography Day 2024
World Photography Day 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 1:54 PM IST

Updated : Aug 19, 2024, 2:31 PM IST

World Photography Day 2024 Exhibition : వరల్డ్​ ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్​ సెంటర్​ ఫర్​ ఫొటోగ్రఫీ సంస్థ తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. భిన్నమైన భావాలను తనలో బంధిస్తూ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేసే గొప్ప శక్తి చిత్రాలకుందని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి, పర్యావరణం, జీవనశైలి, ట్రావెల్, నగర జీవనం, అపురూప కట్టడాలు వంటి వివిధ విభాగాల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 500కు పైగా వచ్చిన చిత్రాల్లో నుంచి 42 ప్రత్యేకమైన వాటిని ఎంపిక చేసి ఈనెల 18 నుంచి ఈనెల 31 వరకు ప్రదర్శిస్తామని నిర్వాహకులు చెప్పారు.

ఫొటోగ్రఫీ గొప్ప కళ : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ , గౌరవ అతిథిగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి హాజరయ్యారు. ఇండియన్ ఫొటో ఫెస్టివల్ 10వ ఎడిషన్ సందర్భంగా నవంబర్ 21 నుంచి జనవరి 5 వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీతో పాటు ఇతర చోట్లా సుదీర్ఘ ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని లక్ష్మీ తెలిపారు. ఫొటోగ్రఫీ గొప్ప కళ అని, అందరూ రాణించలేరని, సృజనాత్మకత చాలా ముఖ్యమని టూరిజం ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ అన్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో కలిసి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీ సంస్థ డైరెక్టర్​ అక్విన్​ మాథ్యూస్​ అన్నారు.

Last Updated : Aug 19, 2024, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details