A Woman Donates 50 Lakhs To TTD: భారత్ సహా పలు దేశాల్లో విపత్తులు, స్పందన విభాగంలో సేవలందించిన ఓ మహిళ తన ఉద్యోగ జీవితంలో పొదుపు చేసిన సొమ్మును శ్రీవారికి కానుకగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమానికి దీనిని వినియోగించాలని ఆమె ఈ సందర్బంగా కోరారు. రేణిగుంటకు చెందిన సి.మోహన అనే మహిళ ఉద్యోగ రీత్యా అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో అభివృద్ధి - విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆమె ఎక్కడ పని చేస్తున్నా గోవిందుని నామస్మరణ మాత్రం మరిచిపోలేదు. ప్రత్యేకంగా పొదుపు చేస్తూ ఆ సొమ్మును శ్రీవారికి కానుకగా ఇవ్వాలని ఆమె సంకల్పించారు. ఈ మొత్తం రూ.50 లక్షల రూపాయలు కాగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి డీడీని అందజేశారు. మోహన ఇచ్చిన నగదు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుకు జమకానుంది.
పొదుపు చేసిన సొమ్ము మొత్తం శ్రీవారికి - రూ. 50 లక్షల విరాళం అందజేసిన మహిళ - WOMAN DONATES 50 LAKHS TO TTD
ఉద్యోగ జీవితంలో పొదుపు చేసిన రూ. 50 లక్షల రూపాయలను శ్రీవారికి కానుకగా అందించిన మహిళ- పలు దేశాల్లో విపత్తులు, స్పందన విభాగాల్లోనూ సేవలు
WOMAN DONATES 50 LAKHS TO TTD (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2025, 12:09 PM IST