పార్శిల్‌లో మృతదేహం - షాక్కు గురైన స్థానికులు - WOMAN BODY IN PARCEL IN AP
ఏపీలోని పశ్చిమ గోదావరి విస్తూగొలిపై ఘటన- పార్శిల్ గుర్తుతెలియని మహిళ మృతిదేహం లభ్యం - దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Published : 12 hours ago
Woman Body Found in Parcel :ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదారి జిల్లా ఉండి మండలం యండగండిలో విస్తుగొలిపే ఘటన జరిగింది. పార్శిల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహం చూసి మహిళ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మహిళ ఇంటి నిర్మాణంకోసం క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో టైల్స్ అందజేశారు. అనంతరం మరోసారి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రెండో విడతలో విద్యుత్ సామాగ్రికి బదులు పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.