ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

5 ఎకరాల్లో గంజాయి సాగు - డ్రోన్​ ద్వారా గుర్తించిన పోలీసులు - POLICE IDENTIFIED GANJA PLANTATION

డ్రోన్స్ తో గుర్తించి 5 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం చేసిన పోలీసులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 12:25 PM IST

Smugglers Cultivating Ganja Paderu :అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయిలో సుమారు 5 ఎకరాలలో గంజాయి సాగును డ్రోన్ సాయంతో గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో డ్రోన్ సాయంతో వెతికినా చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల కనపడలేదని రెండు అడుగుల పైబడి ప్రస్తుతానికి పెరగడంతో ఇప్పుడు డ్రోన్ కి కనిపించాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ మొక్కల కోసం ఈ ప్రాంతంలో పంపిణీ చేశామని అయినా చెడుదారి పడుతున్నారని శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 25 రకరకాల పంట మొక్కల్ని సాగుచేసుకోవాలని సూచించారు. దాడుల్లో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details