Wife who Killed her Husband :కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు భర్తకు తెలియడంతో కుమార్తె సాయంతో భార్య భర్తను హతమార్చింది. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో శనివారం జరిగింది. మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తల్లీకుమార్తెలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్ వంచనగిరి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఉన్నారు.
దామెర మండలం ఊరుగొండకు చెందిన లక్ష్మిని సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే లక్ష్మికి గతంలోనే మరొకరితో వివాహం అయింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని, 12 ఏళ్ల క్రితం సునీల్‌ను లక్ష్మి రెండో వివాహం చేసుకుంది. లక్ష్మికి అప్పటికే ఓ కుమార్తె ఉంది. ఇప్పుడు ఆ బాలికకు 16 ఏళ్లు. సునీల్, లక్ష్మికి వివాహం అయిన తర్వాత కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ బాలుడికి ఆరేళ్లు.
తన కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు సునీల్‌కు రెండు రోజుల క్రితం తెలిసింది. ఈ విషయంపై భార్య, కుమార్తెను మందలించి కొట్టాడు. ఈ విషయం ఇంట్లో గొడవకు దారి తీసింది. దీంతో సునీల్ అక్క శుక్రవారం సునీల్ ఇంటికి వచ్చి భార్యాభర్తలిద్దరూ గొడవలు పెట్టుకోవద్దని దంపతులకు నచ్చజెప్పింది. శనివారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టుకుందామని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.