ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటనున్న వాయుగుండం - భారీ వర్షాలు - Heavy Rains in Srikakulam District - HEAVY RAINS IN SRIKAKULAM DISTRICT

Heavy Rains in Srikakulam District : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా అడపాదడపా పడిన వానలు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పడుతున్నాయి. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరానికి చేరుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update
Weather Update (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 5:21 PM IST

Weather Update : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడచిన మూడు గంటలుగా వాయవ్య దిశలో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కి.మీ. దూరంలో, విశాఖకు తూర్పున 120 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది మరింత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ విశాఖ-గోపాలాపూర్ మధ్య కళింగపట్నం వద్ద ఇవాళ అర్ధరాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rains in Srikakulam District:జోరుగా కురుస్తున్న వానలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. జనజీవనం స్థంభించింది. పలు జిల్లాల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వాన ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చింది. నరసనన్నపేటలో ఈ ఉదయం నుంచి వాన ఎడతెరపి లేకుండా కురుస్తోంది. దీంతో రహదారులపై వర్షపు నీరు చేరింది. పలు కూడళ్లలో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరానికి చేరుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Minister Atchannaidu About Rains : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచన చేశారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు ప్రధాన రహదారులు, కాలనీల్లో మోకాల్లోతు వరకూ నీరు నిలిచింది.రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rains in AP :రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వర్షాల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. రాపకపోకలు నిలిచి పలు చోట్ల రవాణా సౌకర్యం నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సైతం సెవులు ప్రకటించారు. వాన నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి పోతున్నాయి.

సిక్కోలును కమ్మేసిన మేఘాలు.. కనువిందు చేస్తున్న చిత్రాలు

ABOUT THE AUTHOR

...view details