విధులకు వెయిటింగ్ ఐపీఎస్‌లు గైర్హాజరు- డీజీపీ కార్యాలయంలో సంతకాలు చేయని అధికారులు (ETV Bharat) Waiting IPS Officers Absent From Duty :బదిలీ అయ్యి పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో కొందరు డీజీపీ కార్యాలయానికి వచ్చి రోజూ సంతకాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం గైర్హాజరవుతున్నారు. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 16 మంది డీజీపీ కార్యాలయానికి రాకుండా ఇతరత్రా వ్యవహారాల్లో ఉంటున్నారన్న ఫిర్యాదులతో వారందర్నీ రోజూ ఉదయం 10 గంటలకు వాళ్లంతా పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని, సాయంత్రం పని వేళలు ముగిసే వరకూ అందుబాటులో ఉండాలని ఇటీవల డీజీపీ ఆదేశించారు.
డీజీపీ ఆదేశాల తర్వాత నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు ఈ నెల 14 నుంచి 25వ వరకూ సెలవు పెట్టారు. ఈనెల 26 నుంచి గైర్హాజరవుతున్నారు. సీఐడీ విభాగం మాజీ అధిపతి పీవీ సునీల్‌కుమార్ ఈ నెల 13 నుంచి 20 వరకూ సెలవులో ఉన్నారు. ఆ తర్వాత నుంచి పోలీసు ప్రధాన కార్యాలయానికి రావట్లేదు. డీఐజీ విశాల్ గున్ని మొదట్లో కొన్నిరోజుల పాటు హాజరు పట్టీలో సంతకాలు చేశారు.
'వాళ్లు ఇంకా జగన్ మనుషులే' - వెయిటింగ్ ఐపీఎస్‌లపై ప్రభుత్వానికి కీలక సమాచారం - Memos Issue to IPS Officers Issue
ఆగస్టు 20 నుంచి ఇప్పటి వరకూ ఆయన గైర్హాజరులోనే ఉన్నారు. జులై 29 నుంచి ఎస్పీ తిరమలేశ్వర్ రెడ్డి , ఈ నెల 22 నుంచి ఎస్పీ అన్బురాజన్ గైర్హాజరులోనే ఉన్నారు. వెయిటింగ్‌లో ఉన్న వారిలో ఎస్పీలు సిద్దార్థ కౌశల్, మేరీ ప్రశాంతి పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసినప్పటి తర్వాత నుంచి గైర్హాజరులోనే ఉన్నారు. ఎస్పీ జీఆర్ రాధిక ఆగస్టు 12 నుంచి గైర్హాజరులో ఉన్నారు. రాష్ట్రంలో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 14న మెమోలు జారీ చేశారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని వారికి మెమోలు ఇచ్చారు.
వెయిటింగులో 16 మంది ఐపీఎస్ అధికారులు :మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, సంజయ్, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిశాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వరరెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజు, అన్భురాజన్లు మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం వెయిటింగులో ఉన్నారు.
వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమోలు - ప్రతిరోజు వచ్చి సంతకం చేయాలని డీజీపీ ఆదేశం