Vriksha Bandhan Program at Zoo in Visakha:అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండగ. జీవితాంతం ఒకరికొకరు రక్షణగా ఉండాలనే నమ్మకంతో అన్నలకు చెల్లెళ్లు, తమ్ముళ్లకు అక్కలు చేతికి రక్షాబంధనలు కడతారు. అయితే కేవలం రక్త సంబంధీకులే కాకుండా ప్రకృతి నుంచి కూడా రక్షణ ఉండాలనే సదుద్దేశంతో విశాఖ వాసులు వినూత్నంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రక్త సంబంధీకుల మధ్య ఉండే అనుబంధం, అనురాగం, ఆప్యాయతలను బలోపేతం చేసే పండుగే రక్షాబంధన్. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ రక్షాబంధన్ సంప్రదాయం దక్షిణ భారతదేశంలోనూ బాగా ప్రాచుర్యం పొందింది. చెల్లికి అన్న, తమ్ముడికి అక్క రక్షగా ఉండాలనే ఉద్దేశంతో రాఖీ పండుగ జరుపుకొంటారు. అయితే విశాఖవాసులు కేవలం రక్త సంబంధీకుల మధ్యే కాకుండా మానవాళికి, ప్రకృతికి మధ్య కూడా అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.
కొన ఊపిరితో తమ్ముడికి రాఖీ కట్టి - కొద్ది గంటల్లోనే కనుమూసిన యువతి - RAKSHA BANDHAN ON DEATH BED
విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వాహకులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ జంతు ప్రదర్శనశాలలో వందేళ్లు పైబడిన వృక్షాలకు పిల్లలు, పెద్దలు రాఖీలు కట్టి రక్షాబంధన్ జరుపుకొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మంచి ఆలోచనలు ఉన్న పర్యావరణ ప్రేమికుల మధ్య ఈ వృక్షా బంధన్ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందని విశాఖ జంతు ప్రదర్శనశాలకు చెందిన అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ జి. మంగమ్మ తెలిపారు.
కోట్లాది జీవరాశులకు ప్రాణవాయువును ఇచ్చే వృక్షాలకు రాఖీలు కట్టి వాటిని కూడా రక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు.
"సకల జీవకోటికి వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయి. ప్రాణవాయువును ప్రసాదించే చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పర్యావరణ రక్షణపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మానవాళికి, ప్రకృతికి మధ్య కూడా అనుబంధం మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ వేడుకలు నిర్వహించాం." - జి.మంగమ్మ, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్
ఏపీలో ఘనంగా రాఖీ వేడుకలు - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - Raksha Bandhan 2024 in AP