ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి నంబరు బదులు గ్రామం పేరు - కొంతమందికి రెండేసి ఓట్లు - fake votes

Voter List Mistakes in AP : ఎన్నికలు సమీస్తున్న వేళ ఓటరు జాబితాలో అవకతవకలు బయటపడుతునే ఉన్నాయి. అర్హుల పేర్లే ఉండాలని ఎన్నికల అధికారులు సిబ్బందికి సూచించిన అవే తప్పులు పునరావృతం ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఓటరు జాబితాను పరిశీలిస్తే అందరికి అర్థం అవుతుంది. ఇంటి నంబర్లు మాయాజాలంతో ఓటరు జాబితాను రూపొందించారేమో అనే సందేహం కాకుండా ఉండదు.

voter_list_error
voter_list_error

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 1:45 PM IST

Updated : Mar 7, 2024, 3:09 PM IST

ఓటర్ల జాబితాలో ఇంటి నంబరు బదులు కొనకొండ్ల గ్రామం - ఇంటి సంఖ్య స్థానంలో డోర్‌ నంబరు

Voter List Mistakes in AP :రేపో, మాపో ఎన్నికల షెడ్యూల్​ రానుంది. ఇప్పటికే అధికారులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణలు కొనసాగుతున్నాయి. ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగొద్దని ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఓటరు జాబితాలో అర్హుల పేర్లే ఉండాలని, అవకతవకలకు అవకాశం ఇవ్వద్దని ఎన్నికల అధికారులు సిబ్బందికి సూచించినా మళ్లీ అవే తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. ఓటు నమోదు, సవరణలు, మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రూపొందించాలని పదేపదే చెబుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగాానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఈ ప్రక్రియలో అధికార పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా వారికి అధికారులు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.

సున్నా ఇంటి నంబరుతో కోకొల్లలుగా ఓట్లు- అధికారుల అలసత్వంపై విమర్శలు

Voter List Errors in Anantapur District :ఎన్నికల సంఘం జారీ చేసిన తుది ఓటర్ల జాబితాను పరిశీలించే కొద్దీ తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలోని పోలింగు కేంద్రం 53 లో 815 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాబితాలో వరుస సంఖ్య 387, 386, 531, 532, 533, 534, 660, 661లలో ఓటర్లు వివరాల్లో ఇంటి నంబరు స్థానంలో ' కొనకొండ్ల ' అని నమోదు చేశారు. 829 లో ఉన్న ఓటరుకు ఇంటి సంఖ్యను హోస్​ అంటూ పేర్కొన్నారు. మరికొంత మంది ఓటర్ల ఇంటి సంఖ్యల స్థానంలో వార్డు అంకెలు లేకుండా డోర్​ నంబర్లను నమోదు చేశారు.

ఓటరు జాబితాలో ఇంటి నంబర్ల మాయాజాలం - రెండు నంబర్లతో 46 ఓట్లు

Rayadurgam :రాయదుర్గం పురపాలక సంఘంలో అధికారులు ప్రకటించిన తుది జాబితాలో పలు అవకతవకలు నమోదయ్యాయి. కొందరు ఓటర్ల ఇంటి నంబర్లు లేకపోగా, మరి కొందరికి రెండేసి ఓట్లు ఉన్నాయి. రాయదుర్గం పట్టణంలోని 209 పోలింగ్​ కేంద్రంలో పొరాళు శిల్పకు వరుస సంఖ్య 1, 110, 1, 135లలో, ఇదే పోలింగ్​ కేంద్రంలో గట్టు నాగరాజుకు వరుస సంఖ్య 729, 649 లలో రెండేసి ఓట్లు ఉన్నాయి. ఇదే పోలింగు కేంద్రంలో వరుస సంఖ్య 11లో పి. కవిత వరుస సంఖ్య 12లో పలువిర గీత, వరుస సంఖ్య 14లో నాహలి మధుకు ఇంటి నంబర్లు ఖాళీగా ఉంది.

ఉరవకొండ ఓటరు జాబితాలో డబుల్​ ఎంట్రీ - ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

Last Updated : Mar 7, 2024, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details