Vizag Young Lady Preethi Excelling in Modeling:టీనేజీలోకి అడుగిడుతూనే ప్రీతి పట్నాయక్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను గెలుచుకుని ఈ రంగంలో తన అభిరుచికి తగ్గట్టు ఉన్నత శిఖరాలను అందుకునేందుకు గట్టి పునాదినే వేసుకుంది. అన్ని అంశాలపై పట్టు సాధిస్తూనే, మోడలింగ్‌లో తన ప్రతిభను కనబర్చేట్టుగా సాధన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా పలు పోటీలకు సిద్ధమవుతోంది. ఇటీవలే కేరళలో జరిగిన 2024 టైటిల్‌ను సాధించడంతో ఆమెలో విశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇటు చదువు, అటు కొరియోగ్రఫీతో పాటు 13 రకాల నృత్యాలు వంటివాటిని ధీటుగా సమన్వయం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం యత్నాలు చేస్తోంది.
విశాఖకు చెందిన చిన్నారి ప్రీతి పట్నాయక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అనిత, ప్రసాద్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఆమెకు ఇష్టమైన నృత్యంలో గురువుల నుంచి మెళకువలను నేర్చుకుని తన అభినయంతో అందరి మన్ననలు పొందుతోంది. ఆన్లైన్లో 13 రకాల డాన్స్‌లలో శిక్షణ పొంది డిప్లమోను అందుకుంది. ఇదే స్ఫూర్తితో పలు పోటీలకు హాజరవుతోంది.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
జిల్లా స్థాయిలో మోడలింగ్, డాన్స్‌లలో పలు కార్యక్రమాల్లో పాలు పంచుకుని బహుమతులను సొంతం చేసుకున్న ప్రీతి పట్నాయక్ ఇందులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం యత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2024 పోటీలకు హాజరైంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా పోటీ దారులు హాజరయ్యారు. తన ప్రతిభను ప్రీతి అన్ని అంశాలలోనూ ఉత్తమంగా కనబర్చింది.