Vishakha Photographer Murder :డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ ఫొటోగ్రాఫర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖ సీపీ రవిశంకర్ (Visakha CP Ravi Shankar) తెలిపిన వివరాల ప్రకారం, మధురవాడ నగరంలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ (23) పెళ్లి వేడుకలకు వీడియోలు, ఫొటోలు చిత్రీకరణ చేస్తుంటాడు. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు తీసుకొని స్థానిక ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు కూడా ఈవెంట్‌లకు వెళ్తూ కుటుంబంతో జీవనం సాగిస్తుండేవాడు.
మహిళ హత్య - డబ్బు కోసం ఘాతుకానికి పాల్పడినట్లు భర్త అనుమానం
డా.బీఆర్ అంబేడ్కర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులైన షణ్ముఖ తేజ, మరో యువకుడు పది రోజుల ఫొటోషూట్ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయి కుమార్‌ను పిలిచారు. దీంతో తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల విలువైన కెమెరా సామగ్రితో అతడు బయలుదేరి వెళ్లాడు. ఫొటోషూట్‌కు వెళ్లే ముందు పెళ్లి వేడుక ఫొటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.
సాయికుమార్ విశాఖలో రైలు ఎక్కి రాజమహేంద్రవరంలో దిగారు. అనంతరం ఇద్దరు యువకులు కారులో వచ్చి ఫొటోగ్రాఫర్ సాయికుమార్‌ను తీసుకెళ్లారు. సాయికుమార్ వద్ద ఉన్న కెమెరా సామగ్రి మీద వారి కన్ను పడింది. దీంతో రావులపాలెం సమీపంలో అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
బావ, బావమరిదిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి- ఒకరు మృతి
మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సాయి కుమార్ తల్లిదండ్రులు గత నెల 29వ తేదీన విశాఖలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖ తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కెమెరా, సామాగ్రి కోసమే సాయి కుమార్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. అనంతరం మరో యువకుడిని సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి సాయి కుమార్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు.
నికరంపల్లిలో యువకుడి దారుణ హత్య - అడ్డొచ్చిన వారిపై గొడ్డలితో దాడి