Vizag Person Swallows Dentures :ఓ వ్యక్తి దంతాల సమస్య కారణంగా మూడు సంవత్సరాల క్రితం పళ్ల సెట్టును పెట్టించుకున్నారు. వారం రోజుల క్రితం నిద్రపోతున్న సమయంలో అది కాస్తా ఊడి కడుపులోకి పోయింది. దీంతో ఆయనికి విపరీతమైన దగ్గు రావడం ప్రారంభించింది. ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరిక్షించి పళ్ల సెట్టు ఊపిరితిత్తుల వద్ద ఉన్నట్లు గుర్తించి దానిని బయటకు తీశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ నగరానికి చెందిన ప్రకాశ్(52) పళ్ల సమస్య కారణంగా మూడు సంవత్సరాల క్రితం పళ్ల సెట్టును పెట్టించుకున్నారు. వారం రోజుల క్రితం నిద్రపోతున్న సమయంలో పళ్ల సెట్టు ఊడి పొట్టలోకి వెళ్లింది. దగ్గు అధికంగా రావడంతో కిమ్స్ ఐకాన్‌ను సంప్రదించారు. పల్మనాలజిస్ట్ సీహెచ్ భరత్ రోగికి స్కానింగ్ చేసి కుడి పక్క ఊపిరితిత్తుల వద్ద పళ్ల సెట్టు ఉన్నట్లు నిర్ధారించారు. పళ్ల సెట్టును రిజిడ్ బ్రాంకోస్కోపి అనే పరికరం సాయంతో బయటకు తీశారు.
Swallows Set of Teeth Incident Visakha : పళ్లకు రెండు వైపుల లోహం ఉందని డాక్టర్ భరత్ పేర్కొన్నారు. జాగ్రత్తగా తీయకపోతే ఊపరితిత్తులకు, శ్వాస నాళాలకు ఇబ్బందయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ సమస్య రాకుండా జాగ్రత్తగా తొలగించామని వివరించారు. రోగి కోలుకున్నారని వెల్లడించారు. సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉన్నట్లు భరత్ వివరించారు.