Villages Suffering For 20 Years On Bridge issue in Seepudi and Kashipudi :ఒక వంతెన నిర్మిస్తే రెండు గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గడంతోపాటు, సమయం కూడా ఆదా అవుతుంది. వంతెన కోసం 20 ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆ గ్రామాల ప్రజలకు మాత్రం వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం అయినా తమ బాధను అర్ధం చేసుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడ మండలం సీపూడి, కాశీపూడి గ్రామస్థులు కోరుతున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని చిట్టచివర గ్రామాలు సీపూడి, కాశీపూడి. ఈ గ్రామాలకు అనుసంధానంగా పెద కాలువపై వంతెన నిర్మాణం చేయాలని ఏళ్లుగా విన్నపాలు చేస్తున్నారు. వంతెన నిర్మాణం చేస్తామని హమీ ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు గ్రామాలకు వెళ్లాలంటే ఈదులమద్దాలిలో నుంచి చంద్రయ్య కాలువపై ఉన్న వంతెన మీదుగా వెళ్లాలి. వీరికి ఈ మార్గం ఒక్కటే దిక్కు. ఈ రెండు గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం నిత్యం గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన లేక చుట్టూ తిరిగి గుడివాడ వెళ్తున్నామని రహదారి కూడా అధ్వానంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు కుంగింది - ఇప్పుడు కూలింది - విజయవాడకు నిలిచిన రాకపోకలు