Vijayawada Young Boy Ranadhir Excelling in Karate: పదిహేనేళ్ల కుర్రాడు కరాటే పోటీల్లో పతాకాల పంట పండిస్తున్నాడు. కుటుంబం ఇచ్చిన భరోసా, కోచ్ నేర్పిన నైపుణ్యంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. 20కి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి ఔరా అనిపించాడు. అందులో అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం కైవసం చేసుకున్నాడీ యువ క్రీడాకారుడు.
ఈ కుర్రాడి పేరు రణధీర్. స్వస్థలం విజయవాడ. తల్లిదండ్రులు శ్రీనివాస్, సుధీర్ఘ. ఏడేళ్ల వయసు నుంచే కరాటేపై మక్కువ కనపరిచాడీ కర్రాడు. తన ఆసక్తి గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. తరగతిలో పాఠాలు వింటూనే సాయంత్రం వేళల్లో కరాటేలో మెళకువలు నేర్చుకున్నాడు. సాధన చేసిన కొన్నాళ్లకే ఔరా అనిపించే ప్రదర్శన చేశాడు.
రణధీర్ ఆసక్తి, పట్టుదలతో చేస్తున్న సాధన చూసి పోటీలకు పంపించారు తల్లిదండ్రులు. అలా రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పసిడి పతకం సాధించాడు. జాతీయ పోటీలకు ఎంపికై అక్కడా పతకాలతో సత్తాచాటాడు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణ, 2 రజత పతకాలు, 1 కాంస్యం సాధించాడు. వరస పతకాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver
జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యా డు రణధీర్. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో 6స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. గోవాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో రజత పతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయంగా 6 స్వర్ణ, 3రజత పతకాలు కైవసం చేసుకున్నాడు.
రణధీర్ హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా కరాటే టోర్నమెంట్‌లో ఒక రజత పతకాన్ని సాధించాడు. ఇలా వరస పతకాలు సాధించేందుకు కోచ్ శిక్షణ, క్రమశిక్షణనే ప్రధాన కారణం అంటున్నాడు. విఫలమైనా ప్రోత్సహించి తనను కోచ్ ముందుకు నడిపాడని చెబుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించడం పట్ల రణధీర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే కరాటేపైన మక్కువ చూపేవాడని, ఆ ఆసక్తితోనే ప్రస్తుతం అనేక పతకాలు కైవసం చేసుకుంటున్నాడని చెబుతోన్నారు.
పతకాలతో పాటు కరాటేలో గ్రీన్ బెల్డ్ సాధించాడీ బెజవాడ కుర్రాడు. బ్లాక్‌బెల్ట్ సాధించడానికి పట్టుదలతో సాధన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో దేశం తరుఫున ఆడటమే ధ్యేయంగా చెబుతున్నాడు. చదువుల్లోనూ రణధీర్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు.
"చిన్ననాటి నుంచి నాకు కరాటేపై ఉన్న మక్కువతో నేను నా రెండవ తరగతి నుంచి కరాటే నేర్చుకోవటం ప్రారంభించాను. నా కోచ్, తల్లిదండ్రుల సహకారంతో నేను ఇలా వరుస పతకాలు సాధించగలుగుతున్నాను. ఎంత దూర ప్రదేశమైనా నా కోచ్ నన్ను దగ్గరుండి మరీ కరాటే టోర్నమెంట్‌కు తీసుకెళ్లేవారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా నేను సాధన చేస్తున్నాను." - కె. రణధీర్, కరాటే క్రీడాకారుడు
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA