SPECIAL TRAINS TO KUMBH MELA:ఈ నెల 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి.
తిరుపతి టు బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి అంటే 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.