Victims Used Lorry Tubes to Save Lives in Flooded Areas :బుడమేరు వరద ఉద్ధృతితో నీటమునిగిన విజయవాడ బాధితులను లారీ ట్యూబ్‌లు ఆదుకున్నాయి. వరద నీటి నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం పడవలు ఏర్పాటు చేసినా సరిపోలేదు. దీంతో చాలామందిని ఈ పాత ట్యూబ్‌ల ద్వారా నీటిలో మునిగిపోకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆహారం, తాగునీరు అందించడానికి సైతం వీటినే వినియోగించారు.
ట్యూబ్‌ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలింపు : విజయవాడ ముంపు ప్రాంత బాధితుల్ని లారీ టైర్ ట్యూబ్‌లు బాగా ఆదుకున్నాయి. వరద ముంపులో చిక్కుకు పోయిన తమ వారిని రక్షించుకునేందుకు పెద్ద సంఖ్యలో వీటిని బాధితులు వినియోగించారు. ఆహారపొట్లాలు, తాగునీరు లాంటి వాటిని తరలించేందుకు కూడా ఈ ట్యూబులనే ఉపయోగించారు. లక్షల సంఖ్యలో ఉన్న వరద ముంపు బాధితుల్ని ఆదుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా మత్స్యకారుల బోట్లేవీ సరిపోక పోవటం, మారుమూల ప్రాంతాలకు సహాయం అందకపోటంతో గాలికొట్టిన లారీ ట్యూబులే బాధితుల్ని ఆదుకున్నాయి. అజిత్ సింగ్ నగర్ , రాజరాజేశ్వరీ పేట, నందమూరి నగర్, వాంబేకాలనీ, చిట్టినగర్, సితారా, భవానీపురంలో ఈ లారీ ట్యూబ్లను వినియోగించి చాలా మంది ప్రాణాలను కాపాడారు.