ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొడుకు అప్పు చెల్లించడం లేదని తల్లి కిడ్నాప్​ - భయంతో దాక్కున్న కోడలు - UNKNOWN PERSONS KIDNAP WOMAN

అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని వ్యాపారి దారుణం

Mother Kidnapped Due to His Son Not Paying Borrowed Money
Mother Kidnapped Due to His Son Not Paying Borrowed Money (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 3:56 PM IST

Mother Kidnapped Due to His Son Not Paying Borrowed Money :ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తారు? ముక్కుపిండైనా వసూలు చేస్తారనేది వాస్తవం. కానీ తెలంగాణలోని కొడిముంజ గ్రామంలో అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కొడుకు చేసిన అప్పు తల్లికి చేటయ్యింది. అప్పు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి నానా యాగి చేసి, గొడవ పడి వెళ్లలేదు. ఆ ముసలావిడ మనవళ్లను కంటతడి పెట్టించి వెళ్లారు. అసలేెం జరిగిందంటే!

Woman Kidnap in Rajanna Sircilla District : అవసరాల కోసం తన దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇవ్వడం లేదని ఓ వ్యాపారి డబ్బులు తీసుకున్న వ్యక్తి తల్లిని కిడ్నాప్​ చేసిన అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు మేస్త్రీగా పని చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్​ దేవకర్ వద్ద చెరకు కోత కోసం శ్రీనివాస్​ రూ.3 లక్షలు తీసుకున్నాడు. సమయానికి కూలీలు రాకపోవడంతో దేవకర్​, శ్రీనివాస్​ మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది.

గుంటూరు జీజీహెచ్‌ నుంచి అదృశ్యమైన పసికందు సురక్షితం

డబ్బుల విషయమై దేవకర్,​ అతడి అనుచరులు బుధవారం శ్రీనివాస్​ స్వగ్రామానికి వచ్చారు. శ్రీనివాస్​ ఇంట్లోకి చొరబడి అతడి భార్య, తల్లిపై దాడి చేశారు. భయంతో శ్రీనివాస్​ భార్య పక్కింట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కుంది. దీంతో దేవకర్​ అనుచరులు శ్రీనివాస్​ తల్లి భీమాబాయిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. బీమాబాయి మనవడు వెంకటేశ్​ తన నానమ్మను కిడ్నాప్​ చేశారంటూ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. దర్యాప్తు అనంతరం కిడ్నాప్​కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయని పోలీసులు వెల్లడించారు.

'మా బాబాయి డబ్బులు తీసుకున్నాడని మా ఇంటికి వచ్చారు. మీ బంధువులమే అత్తమ్మ వరుస అని చెప్పారు. కానీ మాకుంది ఒకే అత్తమ్మ తనకు ఫోన్​ చేస్తే వాళ్లెవరో నాకు తెలియదు అంటుంది. మాకు మా నానమ్మ కావాలి.' - భీమాబాయి మనవడు

"ఎంతపని చేశావు స్వరూపా" - ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి నమ్మించావుగా!

ABOUT THE AUTHOR

...view details