ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిర్చి రైతులను ఆదుకోవాలని కోరాం: కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడు - RED CHILLI FARMERS PROBLEM

మిర్చికి రూ.11,600కు పైగా ధర ఇవ్వాలి - మిర్చి ఎగుమతులపైనా చర్చ

Union Minister Rammohan Naidu
Union Minister Rammohan Naidu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 11:47 AM IST

Updated : Feb 21, 2025, 1:31 PM IST

Union Minister Rammohan Naidu Comments About Mirchi Farmers Problem: ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కోరినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడు తెలిపారు. మిర్చి రైతులకు చేయూతపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రామ్మోహన్​ నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిర్చికి రూ.11,600కు పైగా ధర ఇవ్వాలని కోరామన్నారు. మిర్చి ఎగుమతులపైనా చర్చించామన్నారు. ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శివరాజ్​సింగ్​ చౌహాన్​ చెప్పారని వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధర కల్పించి ద్వారా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరగా, సమస్య చెప్పిన వెంటనే శివరాజ్‌సింగ్ స్పందించారని తెలిపారు. మార్కెట్‌ ధర, ఉత్పత్తి ఖర్చుల మధ్య వ్యత్యాసం ఇస్తామని చెప్పారన్నారు. మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మిర్చి రైతులను ఆదుకోవాలని కోరాం: కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడు (ETV Bharat)

'మిర్చి రైతులను ఆదుకోండి' - కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

Last Updated : Feb 21, 2025, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details