Home Minister Amit Shah Coming to Vijayawada : రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అమిత్‌షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, సత్య కుమార్, కూటమి నేతలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా చేరుకున్నారు. అమిత్ షాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు.
'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్‌తో అమిత్ షా ఎక్స్‌క్లూజివ్
మూడు పార్టీల అధ్యక్షులతో విందు: చంద్రబాబు నివాసంలో విందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి 11 వేల 400 కోట్లు కేంద్రం ప్రకటించిందున అమిత్ షాను ఏపీ కూటమి నేతలు ఘనంగా సన్మానించారు. అమిత్‌షా కు పవన్‌తో కలిసి సాదర స్వాగతం పలకడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అమిత్ షాతో చర్చించినట్లు ఎక్స్ ద్వారా చంద్రబాబు తెలిపారు.