ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీళ్లేం పిల్లలు - స్కూల్​ నుంచి తప్పించుకునేందుకు ఎంత పని చేశారంటే! - SCHOOL STUDENTS KIDNAP

కర్నూలు జిల్లా సి. బెళగల్ గురుకుల పాఠశాలలో కిడ్నాప్ ఘటన - ఇదంతా నాటకమని చెప్పటంతో ముక్కున వేలేసుకున్న పోలీసులు

SCHOOL_STUDENTS_KIDNAP
SCHOOL_STUDENTS_KIDNAP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2025, 5:41 PM IST

Updated : Jan 27, 2025, 10:39 PM IST

School Students Fake Kidnap in kurnool District : కర్నూలు జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారం ఫేక్ అని తేలిపోయింది. సి బెళగల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 6వ తరగతి విద్యార్థి, 7వ తరగతి విద్యార్థి భోజన విరామ సమయంలో కిడ్నాప్​న​కు గురయ్యారని మరో విద్యార్థి ప్రిన్సిపాల్​కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కొద్దిసేపటికే ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ సెంటర్​లో నిల్చుని ఉన్న విద్యార్థులను స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. వారిని విచారించగా స్కూలు నుంచి తప్పించుకోవటానికి ఎమ్మిగనూరు వచ్చామని ఇదంతా నాటకమని చెప్పటంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. విద్యార్థులను పోలీసులు పాఠశాలకు తరలించారు.

Last Updated : Jan 27, 2025, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details