TTD EO Comments on Tirumala Laddu Controversy:తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కాకరేపుతున్న వేళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని ఈవో చెప్పారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని ఆ నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించానని అన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు.
రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయలేరని ఈవో వివరించారు. మేం హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని తెలిపారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్లు ఎన్‌డీడీబీ తేల్చిందని ఈవో అన్నారు. నెయ్యి తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేసినట్లు వివరించారు. రూ.75 లక్షల విలువైన నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిందని ఈవో వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిపారు.
తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోరు - ఎందుకో తెలుసా? - Devotees Not Put Flowers Tirumala