ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీలో ఆ ఇద్దరికే సర్వాధికారాలు- కమిటీలను రబ్బర్ స్టాంపుల్లా "ఏమార్చి"న జగన్ - TTD BOARD - TTD BOARD

TTD Committees Rubber Stamps During YSRCP Government : టీటీడీ బోర్డును జగన్​ సర్కార్​ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. టీటీడీ కమిటీల్ని కీలుబొమ్మలుగా మార్చేసి పలు అక్రమాలకు పాల్పడింది. కమిటీ సభ్యుల్లో అత్యధికులు ఛైర్మన్​, ఈవో చెప్పిన విధంగా నడుచుకునేవారు. నిత్యావసర సరకుల కొనుగోళ్లు, సివిల్​ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు తెలిపేవారు.

TTD BOARD AS RUBBER STAMP
TTD BOARD AS RUBBER STAMP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 9:22 AM IST

TTD Committees Rubber Stamps During YSRCP Government: టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి, సొంత వారితో నింపేసిన జగన్ అక్కడ సర్వాధికారాలనూ తన బంధువులైన ఛైర్మన్లు, అదనపు ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టేశారు. బోర్డులోని పలు కమిటీలను ఉత్సవ విగ్రహాలుగా మారేశారు. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ కమిటీల సభ్యుల్లో అత్యధికులు బోర్డు చెప్పినదానికి తందానా అనేశారు. అయినవారికి దర్శనాలు చేయించుకోవడానికి, పైరవీలకే పరిమితమయ్యారు. తిరుమల కొండపై చోటు చేసుకున్న పలు అక్రమాల్లో కమిటీ సభ్యులు భాగస్వాములయ్యారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి టెండ‌ర్ల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లడ్డూ విషయంలో ఇంత అనర్థం జరిగి ఉండేది కాదుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కీలుబొమ్మలుగా టీటీడీ బోర్డు :దేవస్థానంలో జరిగే అన్ని అంశాల్ని టీటీడీ పాలకమండలి పరిశీలించలేదు. కాబట్టి సభ్యులు, ఆయా విభాగాల అధిపతులతో పలు కమిటీలు వేస్తారు. టీటీడీలో కొనుగోళ్ల కమిటీ, ఆర్థిక ఇంజినీరింగ్ పనుల కమిటీ, ఎస్టేట్స్ కమిటీ, అప్పీల్స్‌ కమిటీ, హెచ్‌డీపీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బర్ట్ ట్రస్ట్, స్విమ్ గవర్నింగ్ కౌన్సిల్, విద్యాకమిటీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లోని కార్యక్రమాలు, కొనుగోళ్లు, పనులు ఇతర వ్యవహారాల్లో కమిటీ సభ్యుల సిఫారసుల్ని ధర్మకర్తల మండలి సమావేశం ముందు ఉంచుతారు. బోర్డు తీర్మానాలకు ఆమోదముద్ర వేయడానికి ముందు ఆయా కమిటీలు వాటిని పరిశీలించాలి.

శ్రీవారి సేవకు "కోటి రూపాయల" టికెట్‌ - జీవితాంతం స్వామి సేవలో! - ప్రత్యేకతలు తెలుసా? - TTD Udayasthamana Seva Details

జేబులు నింపుకోవడానికే పరిమితం : కమిటీల సిఫారసుల్ని అనుసరించే బోర్డు తీర్మానాలను ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తుంది. అంతటి కీలకమైన కమిటీల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థల నేపథ్యం, వాటి ఆర్ధిక స్థితి, సరఫరాలు, పనులు చేయ గల సామర్థ్యాల్ని పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఛైర్మన్, ఈవో ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఆమోదముద్ర వేసేశారు. కమిటీ సభ్యుల్లో అత్యధికులు వారి జేబులు నింపుకోవడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

టీటీడీ 2021 జనవరిలో కిలో నెయ్యిని రివర్స్ టెండరింగ్ ద్వారా 392.22 చొప్పున కొనుగోలు చేసింది. ఏడాది తర్వాత 2022లో మళ్లీ టెండర్లు పిలిచినప్పుడు కిలో నెయ్యికి రూ. 329 ధర ఖరారు చేశారు. 2024లో టెండర్లు పిలిచి ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ అనే సంస్థకు కిలో 319.85 రూపాయల చొప్పున 6 నెలల్లో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చేసింది.

కల్తీ నెయ్యిపై సిట్​ విచారణ - మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటన - SIT TEAM TO TIRUMALA

గుడ్డిగా ఆమోదం :పాలు, నెయ్యి ధరలు రోజురోజుకూ పెరుగుతాయనే కనీస అవగాహన లేని నాటి పాలకమండలి సభ్యులు, కొనుగోళ్ల కమిటీ సభ్యులు 2021లో రూ. 392 కొన్న కిలో నెయ్యి మూడేళ్ల తర్వాత రూ. 319కి ఎలా వస్తుందనే ఆలోచన చేయలేదు. అసలు మార్కెట్‌లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర ఎంత ఉంది. ఒక కిలో నెయ్యి ఉత్పత్తికి ఎన్ని లీటర్ల ఆవు పాలు కావాలి, ఎంత ఖర్చు అవుతుందనే అంశాలపై టీటీడీ బోర్డు చర్చించలేదు. నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థ అంత తక్కువ ధరకు కోట్‌ చేయడంలో మతలబేంటి. ఆ సంస్థకు సరఫరా సామర్థ్యం ఉందా. వంటి అంశాల్ని టీటీడీ బోర్డు వేసిన కొనుగోళ్ల కమిటీ పరిశీలించిందా అంటే లేదనే సమాధానం వస్తుంది.

ఇష్టారాజ్యంగా ఆమోదాలు :టీటీడీ బోర్డు ఏర్పాటు చేసే కమిటీల్లో కొనుగోళ్ల కమిటీ పాత్ర కీలకం. ప్రసాదాలతో పాటు, భక్తులకు నిత్యాన్నదాన పథకంలో ఉపయోగించే అన్ని రకాల సరకుల కొనుగోళ్లను పర్యవేక్షించేది ఈ కమిటీనే. పైగా టీటీడీ సరకుల కొనుగోలుకు చేస్తున్న ఖర్చు ఏటా పెరుగుతుండటంతో ఈ కమిటీపై గురుతర బాధ్యత ఉంది. టీటీడీ కొనే ప్రతి సరకు ధరనూ కొనుగోలు కమిటీ సిఫారసు చేయాలి. టెండర్లో పాల్గొన్న గుత్తేదారులు కోట్ చేసిన ధరలు హేతుబద్దంగా ఉన్నాయో లేదో చూడాలి. బియ్యం వంటి సరకుల్ని బయటి మిల్లర్లు, హోల్సేల్ దుకాణాల్లో ఏ ధరకు ఇస్తున్నారో వాకబు చేయాలి. అభ్యంతరాలుంటే నివేదికలో పొందుపరచాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తే ఆమోదముద్ర వేసి, పాలకమండలికి సిఫారసు చేయాలి.

మతవిద్వేషాలు రెచ్చగొట్టే యత్నం - జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి: మంత్రులు - AP Ministers fires on YS Jagan

రబ్బర్​ స్టాంపుల్లా టీటీడీ కమిటీ : వైఎస్సార్సీపీ హయాంలో కొనుగోలు కమిటీ అధికారులు ఇచ్చిన వివరాలకు ఆమోదముద్ర వేసే రబ్బరు స్టాంప్‌గా మారిపోయింది. టెండరు ప్రక్రియలో పాల్గొన్నవారు కోట్ చేసిన ధరలు హేతుబద్ధంగా లేవని, వాటిని పక్కన పెట్టాలంటూ కొనుగోలు కమిటీ సిఫారసు చేసిన సందర్భాలు గత ఐదేళ్లలో లేనే లేవు. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ తదితర దినుసులు, సామగ్రిని బోర్డు పెద్దలు 'అత్యవసరం' అంటూ అస్మదీయ కాంట్రాక్టర్లు నుంచి అధిక ధరలకు తీసుకున్నా కొనుగోళ్ల కమిటీ చోద్యం చూసింది. కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న సరకు నాణ్యంగా ఉంటోందా? లేదా? నాణ్యత నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా? వంటి అంశాల్నీ కొనుగోళ్ల కమిటీ పరిశీలించలేదని అర్థమవుతోంది.

రాజకీయ నిర్ణయాలకు వత్తాసు : టీటీడీలో వివిధ సరకుల కొనుగోళ్ల తర్వాత, ఎక్కువ నిధులు ఖర్చు పెట్టేది ఇంజినీరింగ్ విభాగంలోనే. కొండపైనా, తిరుపతిలోనూ టీటీడీ నిధులతో ప్రతిపాదించిన సివిల్ వర్క్స్ ఎంత వరకు అవసరమన్నది వర్క్స్ కమిటీ పరిశీలించి సిఫారసు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, వారి సిఫారసులకు వర్క్స్ కమిటీ కళ్లు మూసుకుని ఆమోదముద్ర వేసేసింది. వీటితో పాటు అనేక రాజకీయ నిర్ణయాలకు సైతం వత్తాసు పలికారు. టీటీడీకీ వచ్చే లీజు సొమ్ములో గోల్‌మాల్‌, పలు భూముల్ని పైసా కట్టకుండా కార్పొరేషన్‌ అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. పలు రోడ్ల విస్తరణ, నూతన రహదారులకు ఆమోదం లేకుండానే చేపట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.

వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉన్నట్లు హిందూయేతరులు పత్రాన్ని ఇవ్వాలి - TTD set up Rules Boards

ABOUT THE AUTHOR

...view details