RTC Bus Passes Decreased In Telangana:గతంలో తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. ఇది సంస్థకు సంతోషకరమైన విషయమే. అయినా బస్‌పాస్‌లు మాత్రం 40 శాతం తగ్గినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నగరంలో గత 3 నెలలుగా ఈ తగ్గుదల కనిపించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం పథకం అందుబాటులోకి వచ్చింది.
దీని ద్వారా మహిళలకు నగరంలో తిరిగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు భారీగా పెరిగారు. అదే సమయంలో పాస్‌లు మాత్రం భారీగా తగ్గాయి. రాష్ట్ర నలుమూలలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు ఉద్యోగ అవకాశాల కోసం, మరికొందరు చదువుకునేందుకు నగరంలో ఉంటారు. ఇక్కడకు వచ్చిన చాలా మంది ప్రజారవాణాపైనే ఆధారపడతారు. నెలంతా ప్రయాణించేవారు బస్‌పాస్‌లు తీసుకుంటారు.
ఫ్లాట్ ఫామ్‌పైకి దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం - RTC bus rams into platform
Bus Passes Decreased in TSRTC :నగరంలో ప్రస్తుతం విద్యార్థుల బస్‌పాస్‌లు లక్షా 60 వేలు, జనరల్ పాస్‌లు 90 వేలు, దివ్యాంగుల పాస్‌లు(Disabled Persons Bus Pass) 30 వేలు, ఎన్జీవో(NGO) పాస్‌లు 2 వేల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షల 82 వేలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాస్‌లపై ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో 7 లక్షలకు పైగా బస్ పాస్‌లు ఉండేవి.