ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ రోజే పదో తరగతి ఫలితాలు - ఇలా వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి - TS SSC Results 2024 - TS SSC RESULTS 2024

TS SSC Results 2024: తెలంగాణ పదోతరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌. ఏడాది పాటు ఎంతో కష్టపడి రాత్రింబవళ్లుచదివి రాసిన పరీక్షల ఫలితాల విడుదలపై బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం ప‌్రకటించారు. మంగళవారం 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

TS SSC 2024 Results
TS SSC 2024 Results

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:31 PM IST

Updated : Apr 25, 2024, 5:27 PM IST

TS 10Th Class Results : తెలంగాణ రాష్ట్రంలో వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలు పదోతరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఈనెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమై 15తేదీకి పూర్తి చేశారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో 19 మూల్యాంకన కేంద్రాల్లో పరీక్షల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌, మార్కుల పత్రాలను ముద్రించడం పూర్తి చేసి ఈనెల 30న పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ఉత్తీర్ణత వివరాలు తెలుసుకునేందుకు సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.

JEE మొయిన్స్‌లో అదరగొట్టిన తెలుగు విద్యార్ధులు - 100 పర్సంటైల్‌లో సగం మనోళ్లే

ఇలా చెక్ చేసుకోండి: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ TS SSC Results 2024 ఫలితాలు ఏప్రిల్ 30, 2024న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్‌ నెంబర్‌ ఆధారంగా అధికారిక బోర్డు వెబ్‌సైట్‌లో సులభంగా చెక్‌ చేసుకోవచ్చు. https://bse.telangana.gov.in/RESULTSJUNTT/

అలాగే తెలుగు ప్రజల విశ్వసనీయ దినపత్రిక ఈనాడు ద్వారా తెలుసుకోవచ్చు.https://results.eenadu.net/

TS SSC 2024 Results విద్యార్థులకు వారి సబ్జెక్ట్ వారీగా స్కోర్లు, మొత్తం ఉత్తీర్ణత గ్రేడ్‌ మాత్రమే తెలుస్తోంది. ఆన్‌లైన్ ఫలితాలు తాత్కాలికం మాత్రమే పూర్తి స్థాయి మార్కుల వివరాల పత్రం విద్యార్ధుల పాఠశాలకు విద్యాశాఖ సరఫరా చేస్తుంది. విద్యార్థులు తమ పాఠశాలల నుండి తమ అధికారిక మార్కుషీట్ల పొందవచ్చు. TS SSC 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సాధారణంగా ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఒక్కో సబ్జెక్టు మొత్తం 100 మార్కులు ఉంటాయి. 2023లో ఉత్తీర్ణత శాతం 86.6 శాతం. మొత్తం మార్కులలో థియరీ పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లకు 20 మార్కులు కేటాయించారు.

599/600 - టెన్త్​ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ

విద్యార్ధులు ఫలితాలను సులువుగా తెలుసుకునేందుకు ఈ కింది మార్గాలను అన్వేషించాలి.

1) తెలంగాణ SSC బోర్డు అధికారిక వెబ్‌పేజ్‌ను లాగిన్‌ కావాలి.

2) "2023-24 SSC పరీక్షా ఫలితాలు" ప్రదర్శించే ఆన్‌లైన్‌ లింక్‌ను క్లిక్‌ చేయాలి.

3) లింక్‌పై క్లిక్ చేసి, హాల్‌టికెట్‌ నెంబర్‌, ఇతర సమాచారాన్ని పొందుపరచాలి.

4) మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ ఆధారంగా మీ ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

5) కావాల్సిన విద్యార్ధులు ఆ ఫలితాల పట్టికను డైన్‌లోడ్‌ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

ఇవీ చదవండి:తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2024​ విడుదల - రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

JEE మొయిన్స్‌లో అదరగొట్టిన తెలుగు విద్యార్ధులు - 100 పర్సంటైల్‌లో సగం మనోళ్లే

599/600 - టెన్త్​ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ

Last Updated : Apr 25, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details