Tribals Suffering With Fever and Bodypains in Palnadu District : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గిరిజన తండా వాసులు అంతుచిక్కని జ్వరాలు, ఒంటి నొప్పులతో సతమతమవుతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రోగాలతోసావాసం చేస్తున్నారు.
పారిశుద్ధ్య లోపం.. పంజా విసురుతున్న జ్వరాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
Tribals Suffering From Fever and Body Pains: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండంలోని అనేక తండాల ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సేవా నాయక్ తండాలో నివసించే గిరిజనులు, చెంచులు జ్వరాలతో సావాసం చేస్తున్నారు. తండాలోని ప్రతి ఇంట్లో జ్వర బాధితులున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. అన్ని వయసుల వారు జ్వరాలు, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులతో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ అంతుబట్టని జ్వరాలు తండాలో ఎవరిని వదిలిపెట్టడం లేదని వాపోతున్నారు. పారిశుద్ధ్య లోపం (Lack of sanitation) తాగునీటి సమస్యోతెలీదు కాని ప్రతి ఒక్కరూ బాధితులే. కొంతమంది కనీసం నడిచే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేరోజు 13వేల మందికి 'వింత జ్వరం'.. భయంతో ఆస్పత్రికి పరుగు.. ప్రభుత్వం అలర్ట్