Gandikota Tourism Center In AP: ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పర్యాటకులకు స్వర్గధామం. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరొందింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కనీస సౌకర్యాలకు నోచుకోక పర్యటకులు ముప్పుతిప్పలు పడ్డారు. ఇక్కడ సదుపాయాలు మెరుగుపడతాయి అనుకుంటే కొత్త నిబంధనలు భారాన్ని మోపుతున్నాయి. కొత్తగా టోల్గేట్ వసూళ్లు చేస్తున్నారు. టికెట్లపై అధికారుల సంతకం ఉండదు. వాహనాలకో రేటు, మనుషులకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఎవరికి ఖర్చు పెడుతున్నారో చిదంబర రహస్యంగా మారింది.
ప్రవేశ రుసుం వసూలు: ప్రముఖ పర్యటక కేంద్రాల్లో గండికోట ఒకటి. పురాతనమైన కట్టడాలు, ఆహ్లాదకర వాతావరణం పర్యటకులను కట్టిపడేస్తాయి. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. సెలవులు, శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అదనుగా ఆసరాగా తీసుకున్న కొద్దిమంది వ్యక్తులు ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. గండికోటకు కిలో మీటరు దూరంలో టోల్గేట్ తరహాలో స్థావరాన్ని ఏర్పాటు చేసి డబ్బులు రాబడుతున్నారు.
లంబసింగిలో ఆకట్టుకుంటున్న అందాలు.. తరలివచ్చిన పర్యటకులు
టోల్ వసూలు:గండికోటను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు. కోటలో ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో పర్యాటకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసేటప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యటకులు డిమాండ్ చేస్తున్నారు.