CM Chandrababu Naidu Meeting With SLBC :నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్ఎల్బీసీ (State Level Bankers Committee)తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు.
Chandrababu naidu Going to Release White Paper :రాష్ట్రంలో ఇసుక విధానంపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. శ్వేతపత్రం ద్వారా ఇసుకపై వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తవ్యస్తంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. అలాగే ఇవాళ విద్యుత్ రంగంపైనా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.