Trains Cancelled in Vijayawada Division :దక్షిణ మధ్య రైల్వే ఏపీలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైన్ పనుల్లో భాగంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పూర్వ నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్ పరిధిలో విజయవాడ, గూడూరు సెక్షన్‌లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖ-కడప (17488), ఆగస్టు 6 నుంచి 11 వరకు కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు అర్థం చేసుకుని తమకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా రద్దయిన రైళ్లు :
- 07500 విజయవాడ- గూడూరు (ఈ నెల 15 నుంచి 30 వరకు)
- 07458 గూడూరు- విజయవాడ (16 నుంచి 31 వరకు)
- 07461 విజయవాడ- ఒంగోలు (16 నుంచి 30 వరకు)
- 07576 ఒంగోలు- విజయవాడ (16 నుంచి 30 వరకు)
- 12743/12744 విజయవాడ- గూడూరు (15 నుంచి 30 వరకు)
- 17259/17260 గూడూరు- విజయవాడ (16, 23, 24, 30 తేదీల్లో)
దారి మళ్లించిన రైళ్లు (వయా రేణిగుంట, ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు మీదుగా) :
- 22878 ఎర్నాకుళం- హౌరా (15,22,29 తేదీల్లో)
- 22863 హౌరా- బెంగళూరు (22వ తేదీ)
- 22841 సంత్రాగచి- తాంబరం (ఈ నెల 22,29 తేదీల్లో)
- 12651 మధురై- నిజాముద్ధీన్ (23,30 తేదీల్లో)