ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో ఇళ్లను పట్టించుకోని వైఎస్సార్సీపీ పాలకులు - కూటమి ప్రభుత్వం రాకతో లబ్ధిదారుల్లో ఆశలు - tidco houses in ap - TIDCO HOUSES IN AP

Tidco Houses Beneficiaries Want Coalition Government to Complete : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. గత ఐదేళ్లలో టిడ్కో ఇళ్లపై వైఎస్సార్సీపీ నాయకులు దృష్టి పెట్టలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. టీడ్కోలను కూటమి ప్రభుత్వమైనా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు

tidco_houses_ap
tidco_houses_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 12:01 PM IST

టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టని వైఎస్సార్సీపీ పాలకులు - కూటమి ప్రభుత్వం రాకతో లబ్ధిదారుల్లో ఆశలు (ETV Bharat)

Tidco Houses Beneficiaries Want Coalition Government to Complete :రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్య పరిష్కరిస్తుందని లబ్ధిదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. విజయవాడ పరిధిలోని వేలాది మంది పేదలకు జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు కేటాయించారు. మొదటి విడతగా ఆ ప్రాంతంలో 10 వేల మందికి గృహాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 8 వేల మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు. వీటిలో 2,500 గృహాల నిర్మాణాలను ప్రారంభించారు.

వసతుల కొరత :గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని గృహాలను 70 శాతం మేర పూర్తి చేశారు. తర్వాత వైఎస్సార్సీపీ పాలనలో అడుగు మందుకు పడలేదు. పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక గృహాల వద్ద పైపులైన్లు పగిలిపోయాయి. టైల్స్ విరిగిపోయాయి. కొన్నిచోట్ల తలుపులు, కిటికీలు దొంగలు పట్టుకుపోయారు. టిడ్కో గృహాలను పూర్తిచేసి అప్పగిస్తామని గృహనిర్మాణ శాఖ అధికారులు పలుమార్లు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదు.

తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP

బ్యాంకు వత్తిళ్లు :వైఎస్సార్సీపీ ప్రభుత్వం గృహాలను పూర్తి చేయకపోగా తమ పేరుపై రుణాలు తీసుకుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం కట్టమని బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. టిడ్కో గృహాలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

టిడ్కో ఇళ్లకు హడ్కో చేయూత- రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు హామీ - Tidco Houses in ap

"ఉగాదికి ఇస్తాం. డిసెంబర్​కు ఇస్తామని అబద్ధాలు చెప్పి వాటి కోసం మేం ఎంతో ఎదురు చూశాం. కానీ ఇళ్లు ఇవ్వలేదు. మా ఇంటికి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే బ్యాంకుల్లో మా పేరుపైన లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు వారు మాకు ఫోన్​ చేసి వడ్డీలు కట్టమని అడుగుతున్నారు. మేము ఇటు ఇంటి అద్దె, అటు లోన్లు ఎలా కట్టాలి. కూటమి ప్రభుత్వం మాకు ఇళ్లు ఇస్తుందని నమ్మకంగా ఉంది. కానీ వీలైనంత తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం" -టిడ్కో గృహ లబ్ధిదారులు

టిడ్కోకు హడ్కో సాయం - 1.17 లక్షల ఇళ్లకు రూ.5,070 కోట్లు అవసరమని అంచనా - Hudco Help To Tidco Houses in AP

ABOUT THE AUTHOR

...view details