ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లద్దాఖ్​లో ఏపీ సైనికుల వీరమరణం- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు - Jawan Died in Accident in Ladakh - JAWAN DIED IN ACCIDENT IN LADAKH

Jawan Died in Accident During Ladakh Army Exercises : లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఏపీ జవాన్లు వీర మరణం చెెందారు. స్వగ్రామాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

jawan_died_in_accident_during_ladakh_army_exercises
jawan_died_in_accident_during_ladakh_army_exercises (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 1:32 PM IST

Updated : Jul 2, 2024, 1:51 PM IST

Jawan Died in Accident During Ladakh Army Exercises : లద్దాఖ్​లో శనివారం జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. వారి పార్థివదేహాలు వారి స్వగ్రామాలకు చేరాయి. బాపట్ల జిల్లా ఇస్లాంపూర్ లో సుభాన్ ఖాన్ , కృష్ణా జిల్లా పెడనలో సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా గిద్దలూరులలో ఆర్.కృష్ణారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించారు.

లద్దాఖ్‌లో జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నాగరాజు మృతదేహాన్ని ఆర్మీ వాహనంలో చేవేండ్రకు తీసుకొచ్చారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నాగరాజు మృతదేహాన్ని చూసేందుకు చేవేండ్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. నాగరాజు అమర్‌రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు. ఇదే ప్రమాదంలో వీరమరణం పొందిన ముత్తుముస రామకృష్ణా రెడ్డికి సైతం అధికారిక లాంచనాలతో తన స్వగ్రామం కాల్వపల్లిలో నిర్వహించారు.

సైనిక విన్యాసాలు చేస్తుండగా నదిలో మునిగిన ట్యాంకర్- ఐదుగురు జవాన్లు మృతి

17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరిన సుభాన్ ఖాన్ హవల్దార్ స్థాయికి ఎదిగారు. రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఇంతలో ప్రమాదం జరిగి కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుభాన్​కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ నెలలో ఇంటికి వస్తానని చెప్పిన సుభాన్​ ఇక లేరని తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సుభాన్​ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించారు. జవాన్ మృతి బాధాకరమని కుటుంబానికి తీరని లోటని ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణ శీల తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల ఆర్థిక సహాయం, ఇళ్ల స్థలం ,అర్హత ను బట్టి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం వస్తుందన్నారు. వాటిని సత్వరంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు .

Three Andhra Pradesh Jawans Died in Ladakh Army Exercises :ఆర్మీ జవాన్ జెసివో ముత్తుముల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మాజీ ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. అనంతరం అధికారాల అంచనాలతో అంతక్రియలు పూర్తి చేశారు. ముత్తుముల రామకృష్ణారెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్మీ జవాను రామకృష్ణారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శనివారం లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన యుద్ధ ట్యాంకు ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలో ​జరిగిన ఘటనలో ఒక జూనియర్​ అధికారితో సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. సైనిక విన్యాసాల్లో భాగంగా నది దాటుతుండగా వరదలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు.

లద్ధాఖ్‌ ప్రమాదం - విజయవాడకు చేరుకున్న జవాన్ల పార్థివ దేహాలు - Ladakh Tank Accident

Last Updated : Jul 2, 2024, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details