తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ దొంగ మామూలోడు కాదు! - ఏకంగా పోలీస్ ఇంటికే కన్నం - THEFT IN POLICE HOUSE

కేసముద్రం మండలంలో పెరిగిపోతున్న దొంగతనాలు - పోలీస్ ఇంట్లో దొంగతనం - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్సై మురళీధర్‌రాజ్‌

Theft in Police House
Theft in Police House (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2025, 10:26 AM IST

Updated : Feb 5, 2025, 2:53 PM IST

Theft in Police House :మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దొంగలు రోజురోజుకు తెగబడి పోతున్నారు. ఏకంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో తాళం పగలకొట్టి చోరీ చేసిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత పోలీస్‌ కానిస్టేబుల్‌ అంబాల కిరణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల ఒకటో తేదీ విధులు ముగించుకొని కేసముద్రంలోని ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి తన స్వగ్రామైన ఇంటికన్నెకు వెళ్లారు.

పండగ అనంతరం అంబాల కిరణ్‌ కుమార్‌ కుటుంబసభ్యులతో మంగళవారం కేసముద్రంలోని ఇంటికి వచ్చారు. ఇంటి తాళం పగులకొట్టి ఉందని, ఇంట్లో ఉన్న బీరువా తెరిచి అందులో ఉన్న 20 తులాల వెండి గొలుసులు అపహరించారని ఆయన తెలిపారు. వెండి గొలుసుల విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని అన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళీధర్‌రాజ్‌ తెలిపారు.

పోలీస్ ఇంట్లో దొంగతనం (ETV Bharat)
Last Updated : Feb 5, 2025, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details