Robbery Cases in Cherukupalli : చోరీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, దేవాలయాలు, కార్యాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రదేశాలు, జన సముహా ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పనిచెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు. అతనో దొంగ. ఇళ్లలోకి ప్రవేశించి చేతికి అందినకాడికి దోచుకున్నాడు. అందులో ఓ మొబైల్‌ఫోన్ కూడా ఉంది. ఆ సెల్‌ఫోన్‌ను అమ్మాలని ప్రయత్నించాడు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ అతడికి ఎదురైంది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయలో తలుపులు తెరిచి ఉంచిన ఇళ్లు, వైద్యశాలల్లోకి ప్రవేశించి చేతికందిన వస్తువులు, నగదు దొంగిలించే వ్యక్తిని చెరుకుపల్లి వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం తెనాలి రోడ్డులో భాస్కర్ థియేటర్ సమీపంలో ఓ ఇంట్లోకి అమృతలూరు మండలం, పాంచాళవరానికి చెందిన సునీల్‌కుమార్ తెల్లవారుజామున వెళ్లి బల్లపై ఉన్న మొబైల్‌ఫోన్‌ను దొంగిలించాడు. తిరిగి 7గంటల సమయంలో వారికే చెందిన దుకాణానికి వెళ్లి తాను దొంగిలించిన సెల్‌ఫోన్ అమ్మేందుకు ప్రయత్నించాడు.