ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తారో తెలియని భయం - ఇళ్లకు దూరంగా పురుషులు - ఆ గ్రామాల్లో నిర్మానుష్యం - TENSION IN LAGACHARLA

తెలంగాణలోని కలెక్టర్​పై దాడి ఘటనతో ఈ రోజుకీ ఇళ్లకు రాని పురుషులు - జనాల్లేక లేక బోసిపోయిన గ్రామాలు - పగలంతా పొలాల్లోనే గడుపుతున్న మహిళలు, పిల్లలు

TENSION_IN_LAGACHARLA
TENSION_IN_LAGACHARLA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 10:14 PM IST

Tension in Lagacharla After Attack on Collector: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్​పై దాడి ఘటన తర్వాత అక్కడి 3 గ్రామాల్లో జనసంచారం కనిపించడం లేదు. విచారణ పేరుతో పోలీసులు వచ్చి ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అని తీవ్ర భయాందోళనలతో గ్రామస్థులు గడుపుతున్నారు. సోమవారం ఘటన జరిగితే ఇప్పటికీ పురుషులు ఇళ్లకు రాకుండా దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలు సైతం పిల్లలను తీసుకొని పొలం పనులకి వెళ్తి సాయంత్రం వరకు అక్కడే గడిపి రాత్రికి బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. లగచర్లలో అయితే కొద్ది మంది జనం అటూఇటూ తిరుగుతూ కనిపించారు కానీ పులిచర్లకుంట తండా, రోటిబండ తండాలు మాాత్రం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగానే ఉన్నాయి.

ఘటన తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకుని విచారించాక మంగళవారం 16 మందిని రిమాండ్​కు తరలించారు. మిగిలిన 34 మందిని విడిచిపెట్టారు. దీంతో వీరంతా ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రధాన నిందితుడు సురేష్​తో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.

నిలిచిపోయిన ఇంటర్​నెట్​:ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాల సేవలను అక్కడి గ్రామాల్లో నిలిపేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో సేవలు, తహసీల్దార్​ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల పనులు నిలిచిపోయాయి. ఇంటర్​ నెట్​ కోసం కొందరు పక్కన ఊళ్లకు వెళ్తున్నారు.

ప్రత్యేక బలగాలు మకాం : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు బలగాలు బొంరాస్​పేట పోలీస్​ స్టేషన్​లో ఉంటున్నాయి. ఎక్కడైనా వీరి అవసరం పడితే వెంటనే అక్కడకు చేరుకునేలా ఉన్నతాధికారులు బలగాలను అక్కడే ఉంచారు.

గాడిద పాలతో ఘరానా మోసం - లబోదిబోమంటున్న రైతులు

కోర్టు బయట మోహరించిన టీఆర్​ఎస్​ శ్రేణులు:లగచర్ల ఘటన నేపథ్యంలో కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డిని బుధవారం పోలీసులు ఏ-1గా కేసు నమోదు చేయడం తదితర పరిణామాలతో వికారాబాద్​ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను తొలుత వికారాబాద్​ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచారణ నిమిత్తం తరలించగా.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలాగే భారో బందోబస్తును ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్​, పరిగి మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్​, మహేష్​రెడ్డి అక్కడి చేరుకోగా, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు.

బీఆర్​ఎస్​ శ్రేణులు ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకోవడంతో, మాజీ ఎమ్మెల్యేలు కలవడానికి బలవంతపెట్టడంతో నరేందర్​ రెడ్డితో రెండు నిమిషాల పాటు కలవడానికి అనుమతించారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నరేందర్​ రెడ్డి వారితో చెప్పగా ఇక చాలని పోలీసులు వారిని బయటకు పంపించేశారు.

భారీగా పోలీసుల మోహరింపు :కొడంగల్​ న్యాయస్థానంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్​రెడ్డిని ముందుగా తెలుసుకున్న బీఆర్​ఎస్​ శ్రేణులు అంబేడ్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలపడానికి ప్రయత్నించారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అక్కడకు బలగాలతో భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కొడంగల్​ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీ డీకే అరుణను మహిళా సిబ్బందితో కలిసి పోలీసులు ఆమెను ఆపారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగగా, బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్​, బీజాపూర్​ జాతీయ రహదారి కొంతసేపు వాహనాలతో స్తంభించిపోయింది.

వృద్ధులకు గుడ్​న్యూస్​ - ఈ కార్డులుంటే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - 159.20 కోట్ల నిధులు మంజూరు

ABOUT THE AUTHOR

...view details