ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ప్రజలను కాటేస్తున్న కలుషిత జలాలు - డయేరియా లక్షణాలతో 10మంది మృతి - DIARRHEA DEATHS IN VIJAYAWADA

TEN Members Died Due to Diarrhea in Vijayawada: విజయవాడలో దాదాపు పది రోజుల నుంచి అతిసారం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకునే వారు లేరని నగరవాసులు గగ్గోలుపెడుతున్నారు. గొంతెండిపోయి గుక్కెడు నీళ్లు తాగాలంటే భయపడిపోతున్నారు. పది మంది చనిపోయినా ఇప్పటికీ వివిధ ప్రాంతాలకు రంగుమారిన నీరే సరఫరా అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

TEN Members Died Due to Diarrhea
TEN Members Died Due to Diarrhea (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 7:26 AM IST

విజయవాడలో ప్రజలను కాటేస్తున్న కలుషిత జలాలు - డయేరియా లక్షణాలతో 10మంది మృతి (ETV Bharat)

TEN Members Died Due to Diarrhea in Vijayawada:విజయవాడలో అతిసారం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. బోర్ల నీరు శుద్ధి చేయకుండా నేరుగా కుళాయిల్లో సరఫరా చేయడంతోపాటు మురుగు నీటి పక్కనే ఉన్న పైప్‌లైన్లు పగిలి కలుషిత నీరు చేరడం వల్లే అతిసారం వ్యాపించింది. బెజవాడలో పరిస్థితి దారుణంగా మారినా పాలకులు గానీ, అధికార యంత్రాంగం గానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ రంగుమారిన నీరే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది.

డయేరియా మరణాలు ఆందోళనకరం- సమస్యపై దృష్టిపెట్టాలి: చంద్రబాబు - chandrababu on diarrhea deaths

బెజవాడ పేరు చెబితేనే బయటి నుంచి వచ్చిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గొంతెండిపోయి గుక్కెడు నీళ్లు తాగాలంటే భయపడిపోతున్నారు. వారం రోజుల్లోనే దాదాపు పది మంది కన్నుమూసినా పాలకపక్షం కనీసం పలకరించలేదు. కలుషిత నీటి వల్లే అతిసారం వ్యాపించి చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుద్ధి చేయని, రంగుమారిన కలుషిత జలాలు సరఫరా అవుతున్నా అవి తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులకు కనిపించడం లేదు. పదిమంది కన్నుమూసినా మరో 150 మంది ఆస్పత్రుల్లో చేరినా ప్రభుత్వానికి గానీ, నగరపాలక సంస్థకు గానీ చీమకుట్టినట్లయినా లేదు. పైగా చనిపోయిన వారంతా అనారోగ్య కారణాలతో మృతిచెందారని బుకాయించడంపై బంధువులు మండిపడుతున్నారు.

కలుషిత జలాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైపులు లీకేజీ అవుతున్నాయని, రంగు మారిన నీరు వస్తోందని చెప్పినా మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. వేసవి ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి నీటి సరఫరా తగ్గించారు. ఆపై నీరు కలుషితం కావడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. ఏళ్లుగా నగరపాలక సంస్థ ఇస్తున్న నీరే తప్ప ప్రత్యామ్నాయం లేదు. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు పెరిగి క్రమంగా మరణిస్తున్నారు. - విజయవాడ నగరవాసులు.

విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు - ఏడుకి చేరిన మృతులు సంఖ్య - DIARRHEA CASES

కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో విద్యాధరపురంలోని హెడ్‌వాటర్‌ వర్క్స్‌ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకూ నీటి సరఫరాకు ఇబ్బంది కారణంగా నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల బోర్లు తవ్వించారు. వీటి ద్వారా భూగర్భ జలాలను రిజర్వాయర్లకు చేర్చి ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వీటి నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. అతిసారం కేసులు అత్యధికంగా నమోదవుతున్న మొగల్రాజపురంలోని పటమటవారి వీధి, అల్లూరి పరమాత్మవీధి, బోయపాటి మాధవరావు వీధుల్లో బోర్ల నుంచి శుద్ధి చేయని నీటి సరఫరాయే కారణమని తేలింది.

కృష్ణా పరివాహక ప్రాంతంలో తవ్విన బోర్లనుంచి మొగల్రాజపురంలోని అనేక ప్రాంతాలకు నీరందిస్తున్నారు. నీటి క్లోరినేషన్‌ కోసం బోర్ల వద్ద ఉన్న డ్రోజర్లు చాలా వరకు పని చేయడం లేదు. బోర్ల నీటిని మొగల్రాజపురంలోని గుమ్మడితోట గ్రౌండ్‌లెవల్‌ రిజర్వాయర్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. అవి తాగిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకపక్ష నేతలు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని స్థానికులు మండిపడుతున్నారు.

విజయవాడలో మృత్యుఘోష - డయేరియా లక్షణాలతో మరణాలు - 9 diarrhoeal deaths In Vijayawada

కలుషిత నీటి సరఫరాపై నగరపాలకసంస్థకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బోర్ల నుంచి శుద్ధి చేయని జలాలు పంపిణీ ఒక ఎత్తైయితే మురుగు కాల్వల వెంట ఉన్న పైప్‌లైన్లు పగిలి నీరు కలుషితమవ్వడం కూడా అతిసారానికి కారణమవుతోంది. నగరపాలకసంస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కలుషిత నీరు కారణం కాదని బుకాయిస్తున్న నగరపాలక సంస్థ బోర్ల నుంచి సరఫరా అవుతున్న నీటిని ఎందుకు నిలిపివేసిందో చెప్పడం లేదు. ఏ తప్పు లేనప్పుడు నీటి సరఫరా ఆపడానికి కారణమేంటో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు.

మొగల్రాజపురంతోపాటు అయోధ్యనగర్, పాతబస్తీలోని ఆంజనేయవాగు తదితర ప్రాంతాలకు నగరపాలక సంస్థ శనివారం సరఫరా చేసిన నీరు రంగు మారింది. సింగ్‌నగర్, పాయకాపురం, ప్రజాశక్తినగర్, శాంతినగర్, గొల్లపాలెంగట్టు, వింజిపేట, చిట్టినగర్‌ తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తోంది. రిజర్వాయర్లు శుభ్రం చేయకపోవడంతో నల్లటి మడ్డి చేరుతోంది. ఇదే నీటితో కలిసి ప్రజలకు సరఫరా అవుతోంది.

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada

ABOUT THE AUTHOR

...view details