ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు - ఈ మండలాల్లో వడగాలులు - AP TEMPERATURE - AP TEMPERATURE

Temperatures Raising Extreme in AP : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ వడగాలులు వీచే 46 మండలాలను వాతావరణ సంస్థ ప్రకటించింది.

ap_temperatures
ap_temperatures

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:07 PM IST

Temperatures Raising Extreme in AP : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ భానుడి ప్రతాపం మొదలైందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం 88 మండలల్లో తీవ్ర వడగాలులు వీచినట్లు పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 45.1, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావారణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- 40డిగ్రీలు దాటొచ్చని వాతావరణశాఖ అంచనా

Temperatures Extreme in All Districts :రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. బుధవారం (ఏప్రిల్​ 17న) 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

High Temperatures: భానుడి భగభగలు.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి..!

Heat Waves in AP : ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇవాళ వడగాలులు వీచే అవకాశమున్న మండలాలను విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం 24, శ్రీకాకుళం 23, పల్నాడు 22, తూర్పుగోదావరి 18, అనకాపల్లి 17, గుంటూరు 15, కాకినాడ 15, పార్వతీపురం మన్యం 15, ఏలూరు 13, అల్లూరి సీతారామరాజు 12, కృష్ణా 10, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 9, ప్రకాశం 8, ఎన్టీఆర్ 6, తిరుపతి 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, బాపట్ల 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్​ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్తు సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details