Telugu Film Chamber meeting in Vijayawada:ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం, ప్రభుత్వ ఏర్పాటుపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 26న విజయవాడలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. చాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజుతో పాటు కార్యదర్శులు దామోదరప్రసాద్, శివప్రసాద్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై విజయవాడలో జరిగే కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. అంతకుముందు హిందూపురం శాసనసభ్యుడిగా మూడోసారి ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను (Nandamuri Balakrishna) కలిసి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Telugu Film Board of Trade), తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district