New Ration Cards and Quality Rice :సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని తెలంగాణ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి.. అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోల పోర్టిఫైడ్ తో పాటు సన్నబియ్యం అందజేస్తామన్నారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి అందజేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏపీలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఏపీలో దరఖాస్తులు ఎప్పటినుంచంటే!
New Ration Cards In AP :రాష్ట్రంలో రేషన్ కార్డుకు అర్హులైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు మొదట దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అనంతరం కార్డుల మంజూరు చేయబోతున్నారు.
సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులు : ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తారు. తరువాత సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.