Telangana High Court Dismissed MP YV Subbareddy Petition :జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(telangana high court) కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ - హౌసింగ్ బోర్డు(indhu Housing Board case)కేసులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆధారాలున్నందున కింది కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లే అవుతుందని అందువల్ల వైవీ పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
వైఎస్సార్సీపీ కొత్త పల్లవి - హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: వైవీ సుబ్బారెడ్డి
Jagan Illegal AssetsCase :జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని ఇందూ- హౌసింగ్ బోర్డు కేసులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆరోపణలున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి హౌసింగ్ ప్రాజెక్టులు అప్పగించడంలో వైఎస్‌ను ప్రభావితం చేయడం ద్వారా గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో 50 శాతం వాటా వైవీకి దక్కిందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందుకుగాను 48 మంది సాక్షులను, 46 డాక్యుమెంట్లను అభియోగ పత్రంతో సహా సీబీఐ కోర్టుకు(CBI)సమర్పించిందని వెల్లడించింది. వైవీ పాత్రపై ఏపీహెచ్‌బీ ఎస్.ఇ దాట్ల సూర్యనారాయణరాజు, వసంత ప్రాజెక్ట్స్ ఆర్థిక సలహాదారు గరికపాటి కమలేష్, నిమ్మగడ్డ ప్రకాశ్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి.కె. దివాన్, ఏపీహెచ్‌బీ ఈఈ నాగార్జున, యూనిటీ ఇన్ఫ్రా ఛైర్మన్ కిశోర్ కృష్ణారావుల వాంగ్మూలాల్లో సీబీఐ స్పష్టంగా పేర్కొందని తెలిపింది. ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలున్నందున కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: వైవీ సుబ్బారెడ్డి
గచ్చిబౌలిలో 4.29 ఎకరాల హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి వసంత ప్రాజెక్ట్స్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వసంత ప్రాజెక్ట్స్ ఇందూ ప్రాజెక్ట్‌కు ఉన్న 51 శాతం వైవీ, కృష్ణప్రసాద్‌లకు బదలాయింపు జరిగింది. వైవీకి 50 శాతం, కృష్ణప్రసాద్‌కు 1 శాతం వాటా కేటాయించారు. దీనికి ప్రతిఫలంగా శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్‌పల్లి హౌసింగ్ ప్రాజెక్ట్స్ అదనంగా 15 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎలాంటి చెల్లింపులు లేకుండా రూ.25.42 కోట్ల ప్రాజెక్టులో వైవీ సుబ్బారెడ్డి 50 శాతం వాటా పొందారు.
కేసును కొట్టివేయాలంటూ నిందితులు పిటిషన్లు దాఖలు చేసినపుడు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిశీలిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ సమర్పించిన ప్రతి పత్రాన్నీ క్షుణ్ణంగా పరిశీలించదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనూప్ కుమార్ శ్రీవత్సవ కేసులో స్పష్టం చేసిందన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారనడానికి బలమైన కారణం ఉంటే తప్ప జోక్యం చేసుకోలేమన్నారు.
'ఇందూ- హౌసింగ్ బోర్డు కేసులో వైవీపై సృష్టమైన ఆధారాలున్నాయ్'- తెలంగాణ హైకోర్టు రాజకీయంగా ఎవరి నిర్ణయం వారిదే - షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
ప్రస్తుత కేసులో ప్రాథమిక ఆరోపణలను బలపరచేలా తగిన సమాచారం ఉందన్నారు. కుట్ర ద్వారా ప్రయోజనం పొందారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. కేవలం ముఖ్యమంత్రి తోడల్లుడు అన్న కారణంగా కేసు నమోదు చేయడం సరికాదని, దీనికి సంబంధించిన చింతలపాటి శ్రీనివాసరాజు వర్సెస్ సెబీ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కె.వివేక్ రెడ్డి ప్రస్తావించగా ఆ తీర్పు ఇక్కడ వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అక్కడ కేవలం తోడల్లుడు అన్న కారణం తప్ప ఎలాంటి ఆధారాలు లేవని, ప్రస్తుత కేసులో వైవీ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. కేసును కొట్టివేయడానికి తగిన కారణాలను వైవీ చూపలేదని, అందువల్ల పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ కె. లక్ష్మణ్ తీర్పు వెలువరించారు.
ఇందూ హౌసింగ్ కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై ఆరుగురు కీలకమైన సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. వీవీ కృష్ణప్రసాద్ ఇద్దరు మైనర్ కూతుళ్లకు రెండు విల్లాలు, ఆయన బంధువైన రవికుమార్, బి.శ్రీనివాసరెడ్డి భార్య, వైవీసుబ్బారెడ్డి సోదరి అయిన బి. శచీదేవి, రాయపాటి కుమారుడు రంగారావు, హెటిరో పార్థసారథిరెడ్డి కుమారుడు వంశీకృష్ణ, కె.వి.పి. రామచంద్రరావు కోడలు సుప్రియ తదితరులకు విల్లాలు విక్రయించినట్లు తెలిపారు. నాణ్యత కూడా మధ్యస్తంగానే ఉందంటూ జెన్టీయుహెచ్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ 2011ల నివేదికిచ్చాయని వాంగ్మూలాల్లో తెలిపారు.