తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్టకేలకు రైతన్నకు విముక్తి - నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా రుణమాఫీ - మల్కాజిగిరిలో కేవలం ఒక్కరికే - Crop Loan Waiver in Telangana - CROP LOAN WAIVER IN TELANGANA

Telangana Crop Loan Waiver 2024 : ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతన్నకు రుణవిముక్తి కల్పించింది. తొలివిడతలో లక్ష లోపు రుణాల మాఫీకి రూ.6, 98 కోట్లను సర్కార్‌ అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. రుణమాఫీతో మొదటి దఫా 10లక్షల 84, 50 కుటుంబాలకు చెందిన రూ.11లక్షల 50, 193 మంది కర్షకులకు లబ్ధిచేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454 కోట్లకు పైగా రుణాలు మాఫీ కాగా అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో పన్నెండున్నర కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

Telangana Govt Cleared Farmers Crop Loan Waiver
Telangana Govt Cleared Farmers Crop Loan Waiver (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 7:26 AM IST

Updated : Jul 19, 2024, 12:09 PM IST

Telangana Govt Cleared Farmers Crop Loan Waiver :ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2లక్షల్లోపు పంటరుణాల మాఫీతో చారిత్రక నిర్ణయం అమలు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా లక్ష రూపాయల్లోపు మాఫీకి 11లక్షల 50వేల 193 మంది రైతుల ఖాతాలకు రూ.6వేల 98.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు తొలి విడతలో 10లక్షల 84వేల 50 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు సర్కార్‌ వెల్లడించింది.

నియోజకవర్గాల వారీగా చూస్తే అందోలులో అత్యధికంగా 19వేల 186 కుటుంబాలకు చెందిన 20వేల 216 మంది రైతులకు రూ.107.83 కోట్లు జమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయింది. నియోజకవర్గాల వారీగా అందోలు, హుస్నాబాద్, కల్వకుర్తి, దుబ్బాక, కొడంగల్, మునుగోడు, దేవరకొండ, తుంగతుర్తి, నారాయణఖేడ్, ధర్మపురి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4, 276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్‌ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు.

రైతు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ సంబురాలు - వేడుకల్లో పాల్గొన్న అన్నదాతలు - Celebration on Rythu Runa Mafi

జిల్లా

రుణ ఖాతాలు

(వేలు)

జమ చేసిన మొత్తం

(కోట్లు)

నల్గొండ జిల్లా 83,124 రూ.454.49 సిద్దిపేట 53,137 రూ.290.24 సూర్యాపేట 56,137 రూ.282.98 సంగారెడ్డి 51,167 రూ.279.61 నాగర్‌కర్నూల్ 59,172 రూ.264.22 వికారాబాద్ 47,048 రూ.258.33 రంగారెడ్డి 49,961 రూ.258.19 మెదక్ 48,864 రూ.241.82 కామారెడ్డి 50,097 రూ.233.41 నిజామాబాద్ 44,469 రూ.225.62 మహబూబ్‌నగర్ 39,380 రూ.211.15 జగిత్యాల 39,269 రూ.207.99 యాదాద్రి 37,285 రూ.203.81 కరీంనగర్ 37,745 రూ.194.64 నారాయణపేట 28,684 రూ.165.45 మహబూబాబాద్ 28,585 రూ.159.65 వనపర్తి 29,613 రూ.156.92 మంచిర్యాల 29,421 రూ.154.39 జనగామ 26,496 రూ.149.69 పెద్దపల్లి 29,725 రూ.149.43 హనుమకొండ 26,369 రూ.145 గద్వాల 24,398 రూ.144.09 రాజన్న సిరిసిల్ల 23,986 రూ.136.36 వరంగల్ 26,396 రూ.134.20 భద్రాద్రి 28,019 రూ.132.07 కుమురం భీం 22,000 రూ.125.20 ఆదిలాబాద్ 18,821 రూ.120.79 జయశంకర్ భూపాలపల్లి 17,054 రూ.94.86 ములుగు 12,997 రూ.69.96 మేడ్చల్ 2,781 రూ.12.53

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయింది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆందోలులో అత్యధికంగా 20,216 మంది రైతులకు రూ.107.83 కోట్లు జమ అయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయింది. కుత్బుల్లాపూర్‌లో 44 మందికి రూ.17 లక్షలు, వరంగల్‌ తూర్పులో 102 మందికి రూ.38 లక్షలు, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 112 మందికి రూ.42 లక్షలు రుణ విముక్తి కలిగింది. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4,276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్‌ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు.

ప్రభుత్వం రుణమాఫీ నిధులు మంజూరు చేయడంతో రైతులు ఆనందంతో కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలాచోట్ల అన్నదాతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి తమ కష్టాలను తీర్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం వల్ల తమ గుండెలపై ఉన్న భారం ఒక్కసారిగా తీరిపోయిందన్నారు.

ఎదురుచూపులకు పుల్​స్టాప్​​ - రైతు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్‌ - FARMER LOAN WAIVER FUNDS CREDITED

ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి - రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి : సీఎం రేవంత్ - congress Meeting at Praja Bhavan

Last Updated : Jul 19, 2024, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details