ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా! - Tamalisai Soundara Rajan

Telangana Governor Resigns : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి తాజాగా ఆమె రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Telangana Governor Resigns
Telangana Governor Resigns

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 11:26 AM IST

Updated : Mar 18, 2024, 1:33 PM IST

Telangana Governor Resigns :గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ పదవితో పాటు అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికీ రాజీనామా చేశారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు వీలుగా తమిళిసై రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ ఉదయం గవర్నర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్, 2019 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి గవర్నర్​గా వచ్చారు. 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై, 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్​సభకు పోటీ చేసిన కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్​గా భారత రాష్ట్రపతి నియమించారు.

రానున్న లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పోటీ చేస్తారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ, నేడు ఉదయం గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తమిళిసై చెన్నై వెళ్లనున్నారు.

తెలంగాణ గవర్నర్ ఏపీకి వచ్చిన వేళ.. ఉద్రిక్తత, అరెస్టులు!

Last Updated : Mar 18, 2024, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details