Telangana Intermediate Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే రెండు సంవత్సరాలను కలిపి 9,80,978 మంది విద్యార్థులుపరీక్షలను రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు.
మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు ఏప్రిల్ 10వ తేదీన మూల్యాంకనం పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్ - డేట్ ఫిక్స్! - Telangana Inter Results
అయితే ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. దానికి ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు విడుదల కాగానే చాలామంది సైట్ ఓపెనే చేసేసరికి సర్వర్ డౌన్ అని చూపిస్తుంది. లేదా లోడింగ్ అవుతూనే ఉంటుంది ఇలాంటివి ఏవీ రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు సర్వర్ హ్యాంగ్ కాకండా చర్యలు చేపట్టారు.