Telangana Cabinet Meeting Decisions : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సుమారు మూడు గంటలకుపైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు, చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, ప్రతి నెలా రూ.25 వేల పింఛన్ : సీఎం రేవంత్ రెడ్డి
Telangana Cabinet Key Decisions 2024 : రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలి ఉండేలా టీఎస్‌ను పెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులగణన చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, 10 బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీగా ప్రకటించింది. ఆ నిబంధనలను గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించింది. గెజిట్ మేరకు టీఎస్‌ను టీజీగా మార్చాలని మా మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేస్తాం. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను కేబినేట్ ఆమోదించింది. మేము చెప్పిన విధంగా ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
CM Revanth Reddy Cabinet Meeting Decisions 2024 :ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్‌ను త్వరలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం.