Atmakuru MLA Anam Ramanaraya Reddy :చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు కూటమికి అఖండ విజయం ఇచ్చారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తామని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని జన చైతన్య వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. జగన్ నియంతృత్వ పోకడల వల్లే వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవి చూసిందని తెలిపారు. ఐదేళ్లలో ఇష్టారీతిన వ్యవస్థలను ధ్వంసం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని హర్షం వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్థానాల్లోనూ దూసుకుపోయిన కూటమి - 21స్థానాల్లో విజయదుందుభి - Loksabha Election Result In AP
MLA Varla Kumarraja : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మస్థలమైన పామర్రులో టీడీపీ జెండా రెపరెపలాడించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు అన్న దానికి తన గెలుపే నిదర్శమని అన్నారు.
Inturi Nageswara Rao :నెల్లూరు జిల్లా కందుకూరులో 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. పార్టీ కార్యకర్తగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేయడంతో టీడీపీ విజయ దుందుభి మోగింది. ఇంటూరి అత్యధిక మెజార్టీ రావడంతో శ్రేణులు సంబరాల్లో మునిగారు. వైఎస్సార్సీపీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి కోసం చంద్రబాబు వైపు అడుగులేశారని నాగేశ్వరరావు తెలిపారు.